Health Tips: హైబీపీ రావొద్దంటే ఈ విషయాలలో చాలా జాగ్రత్త అవసరం..!

Health Tips: హైబీపీ రావొద్దంటే ఈ విషయాలలో చాలా జాగ్రత్త అవసరం..!

Update: 2022-07-10 06:30 GMT

Health Tips: హైబీపీ రావొద్దంటే ఈ విషయాలలో చాలా జాగ్రత్త అవసరం..!

Health Tips: మన దేశంలో ఆయిల్ ఫుడ్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. LDL పరిమాణం పెరగడం వల్ల గుండెకి రక్త సరఫరాలో సమస్యలు ఏర్పడుతాయి. దీంతో రక్తపోటు విపరీతంగా పెరుగుతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. ఇంట్లో ఉంటూనే కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే హైబీపీ రాకుండా చేసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఉప్పు లేకుండా..

ఉప్పు తక్కువగా తినడం వల్ల ఆహారం రుచిగా ఉండకపోవచ్చు. కానీ అధిక వినియోగం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. నిజానికి ఉప్పులో ఉండే సోడియం వల్ల రక్తపోటు పెరుగుతుంది.

2. టెన్షన్ తగ్గించుకోండి

ఈరోజుల్లో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల వల్ల టెన్షన్, స్ట్రెస్ వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. దీనివల్ల రక్తపోటు పెరగడం అనివార్యం. కాబట్టి చిన్న చిన్న సమస్యల గురించి మనస్సును ఒత్తిడి చేయకండి.

3. ఫిజికల్ యాక్టివిటీస్..

రోజువారీ జీవితంలో వర్కవుట్ చేయకపోతే రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. దీని కోసం ఇంట్లోనే పని చేయవచ్చు. లిఫ్ట్‌కు బదులు మెట్లు, బకెట్ ఎత్తడం, స్కిప్పింగ్‌ చేయడం వల్ల కొలెస్ట్రాల్‌తోపాటు బీపీ అదుపులో ఉంటుంది.

4. టీ, కాఫీలు తక్కువ..

మనలో చాలా మంది ఉదయమే టీ లేదా కాఫీతో ప్రారంభించి, సాయంత్రం వరకు చాలా కప్పులు తాగేవారు ఉంటారు. ఇలా చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ పానీయాలలో అధిక మొత్తంలో కెఫిన్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. అందువల్ల పరిమిత పరిమాణంలో టీ లేదా కాఫీని తాగండి.

Tags:    

Similar News