Teeth Pain Tips: ఇలా చేస్తే పంటినొప్పి నిమిషాల్లో మాయం..!

Teeth Pain Tips: ఇలా చేస్తే పంటినొప్పి నిమిషాల్లో మాయం..!

Update: 2022-09-21 15:30 GMT

Teeth Pain Tips: ఇలా చేస్తే పంటినొప్పి నిమిషాల్లో మాయం..!

Teeth Pain Tips: ఒక వ్యక్తికి దంతాలలో నొప్పి వచ్చినప్పుడు అతడు ఎటువంటి ఆహార పానీయాలని తీసుకోలేడు. దంతాల నొప్పికి కారణం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాల్షియం లోపం లేదా దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం లాంటివి ఉంటాయి. ఇలాంటి సమయంలో ఉల్లిపాయతో పంటినొప్పిని దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉల్లిపాయని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.

పళ్ళపై ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి..?

ఉల్లిపాయ, నిమ్మకాయలను కలిపి ఉపయోగించడం వల్ల అనేక దంత సమస్యలను నివారించవచ్చు. మీరు ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మరసం మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనిని ఉల్లిపాయ ముక్కల ద్వారా నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా పంటి నొప్పిని మెళ్లగా దూరం చేసుకోవచ్చు.

ఉల్లిపాయ ఉత్తమమైనది

పళ్లకు ఉల్లిపాయలు వాడితే దుర్వాసన సమస్య వస్తుందని అందరు భావిస్తారు. ఉల్లిపాయను ఉప్పుతో కలిపి ఉపయోగిస్తే ఎటువంటి సమస్య ఉండదు. అది దంతాలను బాగా శుభ్రం చేయడమే కాకుండా దంతాల నొప్పిని దూరం చేస్తుంది. ఈ పరిస్థితిలో మీరు ఉల్లిపాయను రెండు ముక్కలుగా కట్ చేసి దానిపై ఉప్పు చల్లి దంతాలపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు.

Tags:    

Similar News