Beauty Tips: టమోటాలు ఆహారానికే కాదు అందానికి కూడా.. ఉపయోగించడం తెలిస్తే అద్భుత ఫలితాలు..!
Beauty Tips: టమోటా సూపర్ ఫుడ్ మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.
Beauty Tips: టమోటా సూపర్ ఫుడ్ మాత్రమే కాదు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి . ఇవి చర్మాన్ని టానింగ్, పిగ్మెంటేషన్, మొటిమలు, ఇతర సమస్యల నుంచి రక్షిస్తాయి. వాస్తవానికి టమోటాలు మన చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడానికి పనిచేస్తాయి. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజువారీ డైట్‌లో టమోటాను కూడా చేర్చుకోవాలి. అయితే చర్మ సంరక్షణలో టమోటాను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
టొమాటో ముక్కలు
టొమాటో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. దీంతోపాటు ఇది టానింగ్, పిగ్మెంటేషన్ నుంచి బయటపడటానికి సహకరిస్తుంది. టమోటా కట్‌చేసి ముక్కలను చర్మంపై 10-15 నిమిషాలు రుద్దవచ్చు. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా రోజు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
టొమాటో గుజ్జు
చర్మ సంరక్షణలో టొమాటో గుజ్జుని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. టొమాటో గుజ్జు ముఖ రంధ్రాలను లోతుగా శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీన్ని అలోవెరా జెల్‌తో కలిపి ఉపయోగించవచ్చు. ఈ ఫేస్ మాస్క్ ముఖం మీద 20 నిమిషాలు అప్లై చేసి తర్వాత కడగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి.
విటమిన్ Eతో
మీరు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలనుకుంటే టొమాటో గుజ్జును విటమిన్ ఇ క్యాప్సూల్‌తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.