Tomato Price Hike: టమాటా లేకుండానే చేసుకునే వంటకాలు ఇవే.. మీరూ ట్రై చేయండి.!

Tomato price hike: మార్కెట్లో టమాట ధరలు చూసి షాక్ అవుతున్నారు గృహిణులు. టమాటాలు లేకుండా వంట చేయడం ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

Update: 2024-06-18 08:15 GMT

Tomato price hike: మార్కెట్లో టమాటా ధరలు ఆకాశనంటుతున్నాయి. కిలో సెంచరీకి చేరువులో ఉంది. నిత్యం కూరల్లో వాడే టమాటా ధర చుక్కలు చూపిస్తుండటంతో సగలు వినియోగదారులు టమాటా ధర ఎలా ఉందని కనుక్కోవడం తప్పా కొనలేని పరిస్థితి ఉంది. వంటకాల్లో టమాటా తప్పనిసరి. ప్రతి ఇంట్లోనూ టమాటా లేని వంటగది ఉండదు. ఎందుకంటే ఏ కర్రీ చేసినా అందులో టమాటా వేస్తేనే దాని రుచి మరింత పెరుగుతుంది. పోషకాలు అధికంగా ఉండే టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలను చూస్తే మాత్రం సామాన్యులే కాదు సంపన్నులు కూడా కొనాలంటే భయపడుతున్నారు.

అయితే కూరల్లో టమాటాలు లేకుండా చేయలేము. అయితే చాలా మంది టమాటాకు బదులుగా చింతపండు వాడుతుంటారు. అయితే టమాటా ధరలు చూసి కొనడం మానేసిన వాళ్లు అసలు టమాటా లేకుండా తయారు చేసే వంటకాలు ఉన్నాయని తెలుసుకోండి.

పొట్లకాయ:

టమాటా లేకుండానే పొట్లకాయ కూర వండుకోవచ్చు. ఇందులో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బరువుతోపాటు కేలరీల నిర్వహణకు ఇది చక్కగా పనిచేస్తుంది. పొట్లకాయలో అధిక నీరు, ఫైబర్ ఉంటుంది. అధిక కేలరీలను తీసుకోవడం తగ్గిస్తుంది.

పప్పుచారు:

శనగపప్పును ఉడికించి అందులో చింతపండు గ్రేవీ వేసి చేసుకోవచ్చు. కొద్దిగా నీరు వేసి మరిగిస్తే చారు రుచిగా ఉంటుంది.

పచ్చి బఠానీల మసాలా కర్రీ:

పచ్చిబఠానీలలో కావాల్సినన్ని పోషకాలుఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతోపాటు మొక్కల ఆధారిత ప్రొటీన్లు ఉంటాయి. స్పైసీ గ్రీన్ పీస్ వెజిటేబుల్ కర్రీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పాలక్ పన్నీర్:

పాలక్ పన్నీర్ టమోటా లేకుండా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, పాలకూర, పన్నీర్, బట్టర్ , క్రీమ్ తో పాలక్ పన్నీర్ రెడీ చేసుకోవచ్చు.

బెండకాయ ఫ్రై:

అల్లం, కొత్తిమీర, నువ్వు, ఆలివ్ నూనెతో బెండకాయ ఫ్రై చేస్తే అద్భుతమైన రుచి ఉంటుంది. ఇండో వెస్ట్రన్ మసాలా మిక్స్ తో క్రంచీ ఓక్రా అంటే చాలా మంది ఇష్టంగా తింటారు.

పన్నీర్ బటర్ మసాలా:

ఈ రుచికరమైన రిచ్ కర్రీ రెసిసి పనీర్ ప్రియులందరూ ఇష్టంగా తింటారు. టమోటాలు లేకుండానే ఈ కర్రీని సిద్ధం చేసుకోవచ్చు. చపాతీల్లో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

దహీ ఆలూ:

ఉడకపెట్టిన బంగాళదుంపలు, పెరుగుతో ఈ వంటకాన్నీ తయారుచేస్తారు. నవరాత్రుల్లో ఇది స్పెషల్ వంటకం. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఉపయోగించకుండా రాతి ఉప్పుతో దీన్ని వండుతారు.

Tags:    

Similar News