థైరాయిడ్ చాలా ప్రమాదం.. కంట్రోల్‌లో ఉండాలంటే ఇవి తినాల్సిందే..!
* థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి
Thyroid: థైరాయిడ్ శరీరంలోని ప్రధాన గ్రంథి. ఇది మెడలో ఉంటుంది. శరీర కార్యకలాపాలను నియంత్రించడానికి పనిచేస్తుంది. థైరాయిడ్ ట్రియోడోథైరోనిన్ (T3), థైరాక్సిన్ (T4) అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు శరీర విధులకు కచ్చితంగా అవసరం. T3, T4 హార్మోన్లు జీర్ణక్రియ, శ్వాస, కండరాలు, గుండెకు సంబంధించిన అనేక కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటి హైపర్ థైరాయిడిజం, రెండవది హైపోథైరాయిడ్. థైరాయిడ్ కారణంగా బరువు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది.
థైరాయిడ్ లక్షణాలు
థైరాయిడ్ లక్షణాలలో బరువు పెరగడం, బరువు తగ్గడం, హృదయ స్పందన క్రమం తప్పడం, గొంతులో వాపు లేదా భారం, జుట్టు రాలడం వంటివి ఉంటాయి. థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. ఉసిరి
విటమిన్ సి ఉత్తమ వనరులలో ఉసిరి ఒకటి. ఇందులో ఉండే పోషకాలు థైరాయిడ్‌ను అదుపులో ఉంచుతాయి. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలి.
2. పెసరపప్పు
పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అయోడిన్, ప్రోటీన్ లోపాన్ని తొలగించడంలో పనిచేస్తాయి. అయోడిన్ లోపం థైరాయిడ్‌ని కలిగిస్తుంది. అయితే ప్రొటీన్లు అధికంగా ఉండే వాటిని తినడం వల్ల థైరాయిడ్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
3. కొబ్బరి
థైరాయిడ్ రోగులకు కొబ్బరి చాలా మేలు చేస్తుంది. ఇందులో చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (MCFAs), మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MTCs) వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జీవక్రియను ప్రోత్సహిస్తాయి. కొబ్బరి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు ఉపశమనం పొందవచ్చు.
4. గుమ్మడికాయ గింజలు
గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. జింక్ థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది.
5. డ్రై ఫ్రూట్స్
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే ఆహారంలో పరిమిత మొత్తంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం మంచిది. అధిక మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌కు హాని కలిగించే కొవ్వు పెరుగుతుందని గుర్తుంచుకోండి.