Health Tips: థైరాయిడ్ పేషెంట్స్ వీటిని తినవద్దు.. చాలా ప్రమాదం..!
Health Tips: ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది.
Health Tips: ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య సర్వసాధారణమైపోయింది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, తప్పుడు ఆహారం వల్ల ఈ సమస్య ఎదురవుతోంది. థైరాయిడ్‌లో రెండు రకాలు ఉంటాయి. వీటివల్ల రోగి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. థైరాయిడ్ ఉన్నప్పుడు ఆహారంపై దృష్టి పెట్టాలి. లేదంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. వాటి గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
తక్కువ గ్లూటెన్
థైరాయిడ్‌తో బాధపడుతున్న వ్యక్తి గ్లూటెన్‌ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇది శరీరంలో ఊబకాయం, మధుమేహం, అధిక బిపిని పెంచుతుంది. బార్లీ, గోధుమలు, పిండి, వోట్స్, తృణధాన్యాల నుంచి గ్లూటెన్ లభిస్తుంది. ఇది ఆహారం నుంచి పూర్తిగా తొలగించడం కొంచెం కష్టమైన పనే. కానీ థైరాయిడ్ సమస్య ఉంటే పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
ఫాస్ట్ ఫుడ్
ఫాస్ట్ ఫుడ్ థైరాయిడ్‌కి అత్యంత ప్రమాదకరమైన ఆహారం. ఇందులో వాడే పదార్థాలు వ్యాధి తీవ్రతని పెంచుతాయి. మీరు ఒకవేళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఫాస్ట్ ఫుడ్ నుంచి దూరంగా ఉండండి. దూరం చేయండి.
ప్రాసెస్ చేసిన ఆహారం
థైరాయిడ్ రోగులు ప్రాసెస్ చేసిన ఆహారాలకి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.