Health: షుగర్ పేషెంట్లకి ఈ టీ వరంలాంటిది.. ఎందుకంటే..?
Health: భారతదేశంలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అది లేకుంటే రోజు అసంపూర్తిగా ఉంటుంది.
Health: భారతదేశంలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అది లేకుంటే రోజు అసంపూర్తిగా ఉంటుంది. టీని అనేక రకాలుగా తయారు చేయవచ్చు. కానీ మీరు ఆరోగ్యానికి ఉత్తమమైన టీని మాత్రమే తాగాలి. లేదంటే శరీరానికి హాని జరుగుతుంది. సాధారణంగా మనం తాగే పాలు, పంచదార టీ మనకు తాజాదనాన్ని ఇస్తుందేమో కానీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికి బదులు 'బ్లాక్ టీ' తాగవచ్చు.
బ్లాక్ టీ తాగడం వల్ల ప్రయోజనాలు
బ్లాక్ టీలో ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లోరైడ్లు, టానిన్లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. బ్లాక్ టీ ముఖ్యంగా డయాబెటిక్ రోగులకు ఒక వరం కంటే తక్కువ కాదు. ఇది అనేక ఇతర సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
1. మధుమేహం
ఈ రోజుల్లో మిలియన్ల మందికి డయాబెటిస్ పెద్ద సమస్యగా మారింది. ఈ రోగులు రోజువారీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా తీసుకోవాలి.
2. గుండె జబ్బులు
ఈరోజు చాలా మంది గుండె జబ్బుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో మీరు గుండె ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. మీరు బ్లాక్ టీ తాగితే అది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, గుండెపోటు ప్రమాదాన్ని దూరం చేస్తుంది.
3. రోగనిరోధక శక్తి
బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కరోనావైరస్ తరువాత చాలామంది రోగనిరోధక శక్తిని పెంచడంపై దృష్టి పెడుతున్నారు.