Amla Side Effects: ఈ వ్యక్తులు ఉసిరికాయ అస్సలు తినకూడదు.. లాభానికి బదులు నష్టమే..!
Amla Side Effects: ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
Amla Side Effects: ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఇందులో లభిస్తాయి. ఉసిరిని ఆయుర్వేదంలో ఒక వరంలా భావిస్తారు. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే కొంతమంది వ్యక్తులు ఉసిరి తినకూడదు. ఎందుకో ఈరోజు తెలుసుకుందాం.
1. గర్భిణీలు
గర్భిణీలు ఉసిరికాయ తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీలలో దీని లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయి.
2. కాలేయ రోగులు
కాలేయ రోగులు ఉసిరిని తినకూడదు. ఒకవేళ తినాలంటే తక్కువ పరిమాణంతో తీసుకోవాలి. దీన్ని తినడం వల్ల కాలేయ ఎంజైమ్‌ల స్థాయి పెరుగుతుంది. ఇది రోగులకు ప్రమాదకరంగా మారుతుంది.
3. శస్త్ర చికిత్స
చికిత్స శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వ్యక్తులు ఉసిరిని తినకూడదు. దీన్ని తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే సర్జరీకి కనీసం 2 వారాల ముందు ఉసిరి తినకూడదని వైద్యులు చెబుతారు.
4. కిడ్నీ వ్యాధిగ్రస్తులు
ఏదైనా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడే వారు ఉసిరికాయ తినడం మంచిది కాదు. దీన్ని తినడం వల్ల శరీరంలో సోడియం స్థాయి పెరిగి మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది.
5. తక్కువ రక్త చక్కెర స్థాయి
తరచుగా రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే వ్యక్తులు, యాంటీ-డయాబెటిక్ ఔషధం తీసుకునే వ్యక్తులు ఉసిరిని తినకూడదు.