Heart Problem: ఈ పొరపాట్ల వల్ల గుండెపోటు సమస్యలు.. తెలుసుకొని నివారించండి..!

Heart Problem: మన శరీరంలో గుండె ప్రధాన అవయవం. ఇది కొట్టుకోవడం మానేస్తే మనిషి చనిపోయినట్లే లెక్క. దీనిని జాగ్రత్తగా చూసుకోపోతే చాలా ఆరోగ్య సమస్యలు దరిచేరుతాయి

Update: 2023-07-22 15:00 GMT

Heart Problem: ఈ పొరపాట్ల వల్ల గుండెపోటు సమస్యలు.. తెలుసుకొని నివారించండి..!

Heart Problem: మన శరీరంలో గుండె ప్రధాన అవయవం. ఇది కొట్టుకోవడం మానేస్తే మనిషి చనిపోయినట్లే లెక్క. దీనిని జాగ్రత్తగా చూసుకోపోతే చాలా ఆరోగ్య సమస్యలు దరిచేరుతాయి. ఈ రోజుల్లో చాలామంది తెలిసి తెలియక గుండెకు హాని కలిగించే అనేక తప్పులు చేస్తున్నారు. ఈ పొరపాట్ల వల్ల గుండె సమస్యలు ఎదురవుతున్నాయి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పోషకాల లోపం, ఎక్కువ వేయించిన ఆహారాలు తినడం, చెడు అలవాట్ల వల్ల గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. అయితే గుండెని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

ధూమపానం, మద్యం మానేయాలి

ఈ రోజుల్లో చాలా మంది ధూమపానం చేస్తున్నారు. స్మోకింగ్ అలవాటు గుండెపై అధికంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సిగరెట్ పొగ వల్ల రక్తం చిక్కగా మారి గడ్డకట్టడం మొదలవుతుంది. దీని కారణంగా రక్తప్రసరణ సరిగ్గా జరగక గుండెపోటు ముప్పు పెరుగుతుంది. అంతేకాకుండా చాలాసార్లు రక్తపోటు సమస్య కూడా ఎదురవుతుంది. మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల శరీరంలోని అన్ని అవయవాలకి నష్టమే జరుగతుంది. అందుకే ధూమపానం, మద్యం తాగడం మానేయాలి.

బరువు తగ్గించాలి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బరువును కంట్రోల్‌ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే గుండె జబ్బులు పెరగడానికి స్థూలకాయమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. పిల్లలు అధికంగా బరువు పెరగడం వల్ల వారి గుండెకి ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు తగ్గడానికి ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఎక్కువ ఒత్తిడికి గురవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు సమస్య ఎదురవుతుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం ఒత్తిడికి దూరంగా ఉండటం బెటర్‌.

చెడు కొలస్ట్రాల్ తగ్గించాలి

బాడీలో చెడు కొలస్ట్రాల్‌ పెరగడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ఎందుకంటే రక్త నాళాలలో కొలస్ట్రాల్‌ పేరుకుపోయి రక్త సరఫరాకి అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు సమస్యలు ఎదురవుతాయి.

Tags:    

Similar News