Hair Problems: జుట్టు షైనింగ్ కోసం ఈ మూడు బెస్ట్.. అవేంటంటే..?
Hair Problems: జుట్టు షైనింగ్ కోసం ఈ మూడు బెస్ట్.. అవేంటంటే..?
Hair Problems: ఆధునిక జీవన శైలిలో కలుషిత ఆహారం, పొల్యూషన్ వల్ల జుట్టు మొత్తం నిర్జీవంగా మారుతోంది. మార్కెట్లో లభించే ఎన్ని బ్యూటీ ప్రొడాక్ట్స్ వాడినా ఎటువంటి ఫలితం ఉండటం లేదు. జుట్టు మొత్తం సహజ గుణాలను కోల్పోయి అంద విహీనంగా తయారవుతుంది. ఈ బాధతో కొంతమంది ఇంటి నుంచి బయటకి రావాలంటే జంకుతున్నారు. పోయిన మెరుపుని మళ్లీ తీసుకురావొచ్చు. కానీ అది మార్కెట్‌లో లభించే ప్రొడాక్ట్స్ వల్ల మాత్రం కాదు. ఇంట్లోనే సహజసిద్దమైన పదార్థాలతో జుట్టుని అందంగా తయారుచేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
1. అలోవెరా జెల్
ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీరు కలబంద జెల్‌ను ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలం. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. మీరు తలపై దురదను కూడా తగ్గించుకోవచ్చు. కలబంద జెల్‌ను నేరుగా జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగినా సరిపోతుంది.
2. అవకాడో
అవోకాడో డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడానికి మంచి ఎంపిక. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. అవకాడో హెయిర్ ప్యాక్ చేయడానికి అవకాడో కట్ చేసి అందులో గుడ్లు మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. సుమారు అరగంట తర్వాత మీ జుట్టును గోరువెచ్చని లేదా చల్లటి నీటితో కడగాలి. దీనిని తరచూ చేస్తూ ఉండాలి.
3. ఆలివ్ నూనె
ఆలివ్ నూనెను సహజ కండీషనర్‌గా చెబుతారు. దీని కోసం ఒక పాత్రలో ఆలివ్ నూనెను వేడి చేసి, కొద్దిగా చల్లారిన తర్వాత తలపై మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన టవల్ ను జుట్టుకు కట్టి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఈ పద్ధతి జుట్టును మెరిసేలా చేయడమే కాకుండా మృదువుగా చేస్తుంది.
4. ఆపిల్ వెనిగర్
మీరు జుట్టు కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు. దీని కోసం ఆపిల్ వెనిగర్‌లో 2 టీస్పూన్ల ఆలివ్ నూనె, ఒక గుడ్డు కలపడం ద్వారా హెయిర్ మాస్క్‌ని తయారు చేయవచ్చు. ఇప్పుడు దీనిని జుట్టుపై అరగంట పాటు అప్లై చేయాలి. తర్వాత షాంపూతో కడగాలి.