Health Tips: గుండెలో వాపు ఏర్పడితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. జాగ్రత్త..!
Health Tips: చాలా మంది తరచుగా ఛాతీ నొప్పి, మంట, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
Health Tips: చాలా మంది తరచుగా ఛాతీ నొప్పి, మంట, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలని నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదంగా మారుతాయి. గుండెలో మంట ఏర్పడితే గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. గుండెలో వాపు ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని అస్సలు విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
అలసిపోవడం
ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండెలో వాపునకు సంకేతంగా చెప్పవచ్చు.
మైకము
చాలా మంది వ్యక్తులు మైకము సమస్యని ఎదుర్కొంటారు. అంతేకాదు దీనిని పట్టించుకోరు కూడా. అలా చేయడం వల్ల మీకు భారీగా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఇది గుండెలో మంట వల్ల జరిగే అవకాశం ఉంది.
శరీర భాగాలలో వాపు
శరీరంలోని కాళ్లు, చేతులు వంటి ఏదైనా భాగంలో వాపు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది గుండెలో వాపు వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తేలిగ్గా తీసుకోవద్దు.
గుండెలో వాపు నివారణ
1. ఇప్పటికే ఇన్ఫెక్షన్ బారిన పడి ఇబ్బందిపడుతున్న వ్యక్తులతో సంబంధాన్ని నివారించండి.
2. ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోండి.
3. రోజూ వ్యాయామం చేయండి.
4. రోజూ శ్వాస వ్యాయామాలు చేయాలి.