Health Tips: గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం..!

Health Tips: ఒకప్పుడు గుండెపోటు అనేది యాభై ఏళ్లు పైబడిన వారికి వచ్చేది. కానీ నేటికాలంలో చిన్నవయసులోనే చాలా గుండెపోటుతో చనిపోతున్నారు.

Update: 2024-01-31 16:00 GMT

Health Tips: గుండెపోటుకు ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం..!

Health Tips: ఒకప్పుడు గుండెపోటు అనేది యాభై ఏళ్లు పైబడిన వారికి వచ్చేది. కానీ నేటికాలంలో చిన్నవయసులోనే చాలా గుండెపోటుతో చనిపోతున్నారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. జీవన విధానంలో మార్పులు, వేయించిన ఆహారలు తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్ల గుండెపోటుకు గురవుతున్నారు. దీనిని నివారించడానికి ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. గుండెపోటుకు ముందు శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది వాటిని విస్మరిస్తారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గుండెపోటుకు ముందు శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల వ్యాధి తీవ్రమవుతుంది. రోజు రోజుకి పాదాలలో వాపు వస్తుంటే గుండెపోటుకి సంకేతమని గుర్తించండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం, కళ్లు తిరగడం జరిగితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. గుండెపోటుకు కొన్ని నిమిషాల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.

గుండెపోటు ప్రారంభ లక్షణాలలో చెవులకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. మీరు చెవులలో చాలా శబ్ధాలను వినిపించినట్లయితే అస్సలు విస్మరించకూడదు. మీరు కొంతకాలంగా గుండె కొట్టుకోవడంలో మార్పులను గమనిస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. అలాగే తరచుగా చెమటలు పట్టడం, ఆయాసం రావడం జరుగుతాయి. కొన్నిసార్లు ఛాతిలో నొప్పి ఉంటుంది. దీనిని కూడా విస్మరించవద్దు.

Tags:    

Similar News