Health Tips: ఈ పప్పులు కూడా కొవ్వుని కరిగిస్తాయి.. డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలు..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు.

Update: 2023-06-09 14:00 GMT

Health Tips: ఈ పప్పులు కూడా కొవ్వుని కరిగిస్తాయి.. డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలు..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎటువంటి ఆశించిన ఫలితం ఉండటం లేదు. అయితే బరువు తగ్గడం అనేది కొంచెం సమయం తీసుకునే ప్రక్రియ అని గుర్తుంచుకోండి. మంచి ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. వాస్తవానికి కేలరీలను బర్న్ చేస్తే శరీరంలోని కొవ్వు ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది. కొంతమంది కొవ్వును కరిగించడానికి జిమ్‌లో చెమటలు పట్టిస్తారు. అయితే కొవ్వును కాల్చే సహజ మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

మసూర్ పప్పు

భారతదేశంలో మసూరు పప్పుని ఎక్కువగా తింటారు. ఇందులో ప్రొటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.

శెనగలు

ఒక కప్పు ఉడికించిన శెనగలలో 15 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఫోలేట్, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడానికి పనిచేస్తాయి.

బాదం

ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రకారం జిమ్‌కి వెళ్లే ముందు బాదంపప్పు తినాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్లు వ్యాయామ సమయంలో ఎక్కువ కొవ్వుని కరిగిస్తాయి.

పాలకూర

పాలకూరలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని పచ్చిగా తినకుండా ఉడకబెట్టి తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలకూరలోని పోషకాలు సరైన రీతిలో శరీరానికి మేలు చేస్తాయి.

కాటేజ్ చీజ్

పనీర్‌ను కాటేజ్ చీజ్ అని కూడా అంటారు. ఇది తక్కువ కేలరీలు, కొవ్వు స్థాయిలను కలిగి ఉంటుంది. ఇందులో చాలా ప్రొటీన్లు లభిస్తాయి. కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి12, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవన్ని బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.

Tags:    

Similar News