Health Tips: పాదాలలో ఈ సమస్యలుంటే అది చెడు కొలస్ట్రాల్‌ లక్షణాలే.. విస్మరించడం చాలా ప్రమాదం..!

High Cholesterol Feet Warning Signs: చెడు కొలస్ట్రాల్‌ వల్ల ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

Update: 2023-06-06 15:00 GMT

Health Tips: పాదాలలో ఈ సమస్యలుంటే అది చెడు కొలస్ట్రాల్‌ లక్షణాలే.. విస్మరించడం చాలా ప్రమాదం..!

High Cholesterol Symptoms: చెడు కొలస్ట్రాల్‌ వల్ల ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. సిరల్లో ఇది గడ్డకట్టడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిగా జరుగుతుంది. ఈ పరిస్థితులలో గుండెపోటు సంభవిస్తుంది. రక్త పరీక్ష ద్వారా అధిక కొలెస్ట్రాల్‌ను గుర్తించవచ్చు. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, తప్పుడు ఆహారం వల్ల బాడీలో చెడు కొలస్ట్రాల్‌ పెరుగుతుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలని వివిధ మార్గాల్లో తెలుసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

శరీరంలో రెండు రకాల కొలస్ట్రాల్‌ ఉంటాయి. ఒకటి మంచిది మరొకటి చెడ్డది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. దీని లక్షణాలు పాదాలలో కనిపిస్తాయి. వేసవిలో అరికాళ్లు చల్లగా ఉండే వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యలని కలిగి ఉంటారు. ఇలా ఉన్నట్లయితే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఇతర కారణాల వల్ల అరికాళ్లు చల్లగా ఉంటాయి. కానీ చెక్‌ చేసుకోవడం ఉత్తమం.

చర్మంలో మార్పులు

శరీరంలో పోషకాలు, ఆక్సిజన్ లోపం ఉన్నప్పుడు చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. కానీ శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకుంటే పాదాల రంగు మారుతుంది. ఇది కాకుండా కాళ్ళలో తిమ్మిరి వస్తుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. వైద్యుడిని సంప్రదించి వెంటనే చికిత్స తీసుకోవడం ఉత్తమం.

దీర్ఘకాలిక నొప్పి

కొలెస్ట్రాల్ స్థాయి క్షీణించినప్పుడు పాదాలలో నిరంతరం నొప్పి ఉంటుంది. దీన్ని నివారించడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్, మందులు వాడుతారు. కానీ ఇది అధిక కొలెస్ట్రాల్ సమస్య అని అర్థం చేసుకోలేరు. శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి 200 mg/dl కంటే తక్కువగా ఉండాలి. అయితే LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి 100 mg/dl కంటే తక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News