Guava Side Effects: ఈ వ్యక్తులు పొరపాటున కూడా జామపండు తినకూడదు..!
Guava Side Effects: ఈ వ్యక్తులు పొరపాటున కూడా జామపండు తినకూడదు..!
Guava Side Effects: జామ చాలా రుచికరమైన పండు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని చాలామంది ఇష్టంగా తింటారు. దీని గుజ్జు గులాబీ, తెలుపు రంగులలో ఉంటుంది. భారతదేశంలో దీన్ని తినేవారికి కొరత లేదు. ఇందులో శరీరానికి ఎంతో మేలు చేసే ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫోలేట్, బీటా కెరోటిన్ కూడా ఈ పండులో ఉంటాయి. అయితే ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ జామ పండు అందరికీ ఉపయోగపడదు. కొన్ని పరిస్థితులలో జామపండును అతిగా తినడం మానుకోవాలి.
1. జలుబు, దగ్గు
జలుబు-దగ్గు ఉన్నవారు జామపండు తినకూడదు. ఎందుకంటే దీని ప్రభావం చల్లగా ఉంటుంది. ఇది అసౌకర్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట తినకుండా ఉండాలి. లేదంటే జలుబు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2. ఇరిటేటెడ్ బవెల్ సిండ్రోమ్ పేషంట్స్
జామ అనేది ఫైబర్ రిచ్ ఫుడ్. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్యలను కూడా తొలగిస్తుంది. అయితే ఈ పండును అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని చాలామందికి తెలియదు. ముఖ్యంగా ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారు జామపండుకి దూరంగా ఉండాలి.
3. కడుపు ఉబ్బరం
జామపండులో ఫ్రక్టోజ్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటినీ ఎక్కువగా తింటే కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. దీని వల్ల శరీరంలో విటమిన్ సి ఎక్కువగా గ్రహించడం కష్టమవుతుంది. ఇందులో ఉండే సహజ చక్కెర ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది. జామపండు తిన్న వెంటనే నిద్రపోకుండా ఉండాలి. లేదంటే శరీరంలో వాపు పెరుగుతుంది.
4. డయాబెటిక్ పేషెంట్స్
జామ ఒక తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. దీని కారణంగా మధుమేహ రోగులు దీనిని తరచుగా తింటారు. అయితే దీనిని పరిమిత పరిమాణంలో తినాలి. గ్లూకోజ్ స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే జామలో సహజ చక్కెర ఉంటుంది.
5.ఒక రోజులో ఎన్ని జామపళ్లు తినాలి?
ఒక రోజులో ఒకటి నుంచి రెండు జామపండు తినడం ఆరోగ్యానికి మంచిది. మీరు దీన్ని 2 భోజనాల మధ్య తినడం ఉత్తమం. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం మంచిదని భావిస్తారు. అయితే ఏదైనా చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం.