Beetroot: ఈ వ్యక్తులు బీట్‌రూట్‌ అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Beetroot: బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Update: 2022-10-23 11:10 GMT

Beetroot: ఈ వ్యక్తులు బీట్‌రూట్‌ అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

Beetroot: బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. బీట్‌రూట్‌లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. విటమిన్‌ సి, ఫోలేట్‌, ప్రొటీన్‌, ఫైబర్‌ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు దీనిని తినాలని సూచిస్తారు. అయితే కొంతమంది దీనికి దూరంగా ఉండాలి. ఎక్కువగా తినకూడదు. వారి గురించి తెలుసుకుందాం.

1. ఐరన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు

శరీరంలో ఐరన్ అధికంగా ఉన్నప్పుడు బీట్‌రూట్‌కి దూరంగా ఉండాలి. ఎందుకంటే అధిక ఐరన్‌ పరిస్థితిని హిమోక్రోమాటోసిస్ అంటారు. ఇలాంటి వారు బీట్‌రూట్‌ తింటే శరీరంలో ఐరన్ కంటెంట్‌ను మరింత పెంచుతుంది. ఇది అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది.

2. కిడ్నీ స్టోన్

కిడ్నిస్టోన్‌ ఉంటే చాలా నొప్పిని భరించవలసి ఉంటుంది. ఈ సమస్య 2 రకాలు, మొదటి కాల్షియం ఆధారిత, రెండవది ఆక్సలేట్ ఆధారితం. ఒక వ్యక్తికి ఆక్సలేట్ ఆధారిత కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే వారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండాలి.

3. మూత్రం రంగులో మార్పు

కొంతమంది బీట్‌రూట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఎక్కువగా తీసుకుంటే, ఖచ్చితంగా మూత్రం రంగు మారుతుంది. అది ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. ఇది శరీరంలో సమస్యలని కలిగిస్తుంది. కాబట్టి బీట్‌రూట్ వినియోగాన్ని తగ్గించడం మంచిది.

Tags:    

Similar News