Diabetes: షుగర్‌ పేషెంట్లు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ..!

Diabetes: షుగర్‌ పేషెంట్లు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ..!

Update: 2022-08-27 04:30 GMT

Diabetes: షుగర్‌ పేషెంట్లు ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ..!

Diabetes: మధుమేహం భారతదేశంలో రోజురోజుకి పెరుగుతోంది. షుగర్ వ్యాధికి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు గట్టి మందు కనుగొనలేకపోయారు. ఈ పరిస్థితిలో దీనికి నివారణ అంటే రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం మాత్రమే. ఇందుకోసం మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. డయాబెటిస్ అనేది ఒక సంక్లిష్ట వ్యాధి. ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక ఇతర వ్యాధులు చుట్టుముడుతాయి. ఇది శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది.

1. గుండె

మధుమేహ వ్యాధిగ్రస్తులు గుండె జబ్బులకు గురవుతారని మీరు తరచుగా గమనించి ఉండాలి. మీకు చాలా కాలంగా మధుమేహం ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల డయాబెటిస్‌లో హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

2. కిడ్నీ

దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడే వారు కిడ్నీ వ్యాధిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కిడ్నీకి సంబంధించిన చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు క్రియాటినిన్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడం వల్ల మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. కిడ్నీలు బాగా లేకుంటే రక్త వడపోత ప్రక్రియ దెబ్బతింటుంది. శరీరంలో టాక్సిన్స్‌ పెరుగుతాయి.

3.కళ్ళు

రక్తంలో చక్కెర స్థాయి నిరంతరం ఎక్కువగా ఉంటే అది కళ్ళకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది కంటి చూపును కోల్పోతారు లేదా దృష్టి బలహీనంగా మారుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు రెటీనాలో ఎక్కువ ద్రవాన్ని పొందుతారు. ఇది చాలా ప్రమాదకరమైనది.

Tags:    

Similar News