Health Tips: అధిక కొలస్ట్రాల్ సమస్యలు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే..!
Health Tips: శరీరంలో కొలస్ట్రాల్ పెరిగిందంటే చాలా ప్రమాదం.
Health Tips: శరీరంలో కొలస్ట్రాల్ పెరిగిందంటే చాలా ప్రమాదం. దీనిని సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. కొంతకాలంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. అందుకే సరైన సమయంలో లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం మంచిది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఈరోజు తెలుసుకుందాం.
1. చేతులు, పాదాలలో నొప్పి
రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పెరిగితే చేతులు, కాళ్ళలో నొప్పి పుడుతుంది. రక్తం, ఆక్సిజన్ శరీర భాగాలకి సరిగ్గా చేరదు.
2. ఛాతీ నొప్పి
అధిక కొలెస్ట్రాల్ తీవ్రమైన ఛాతీ నొప్పికి కారణమవుతుంది. రక్త నాళాలలో ఫలకం ఏర్పడినట్లయితే అది రక్త ప్రవాహంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఛాతీ నొప్పికి కారణమవుతుంది.
3. కనురెప్పల మీద కొవ్వు
కొలెస్ట్రాల్ నిక్షేపాలు కనురెప్పలపై ఏర్పడుతాయి. వాటిని Xanthelasmas అంటారు. ఈ భాగాలలో కొవ్వు నిల్వలు ఏర్పడితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
4. డిప్రెషన్ & మెమరీ లాస్
సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే ఒక వ్యక్తి ఒత్తిడి, మతిమరుపుకు గురవుతాడని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలలో తేలింది.
5. చేతులు, కాళ్ళలో తిమ్మిరులు
చేతులు, కాళ్ళలో తిమ్మిరులు వస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు ఇది జరుగుతుంది. దీని కారణంగా రక్త ప్రవాహం మందగిస్తుంది.
6. శరీరంలో గడ్డలు
కొలెస్ట్రాల్ కారణంగా శరీర భాగాలలో కొవ్వు గడ్డలు ఏర్పడుతాయి. వీటిని లిపోమాస్ అంటారు. ఈ గడ్డలు చర్మం, కండరాల మధ్య ఏర్పడతాయి. ఇలాంటివి అయినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.