Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే వీటిని కచ్చితంగా తినాలి.. అవేంటంటే..?
Hair Growth: ఈరోజుల్లో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది.
Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే రకరకాల షాంపులు, ఆయిల్స్ వాడటం కాదు ముందుగా డైట్‌లో మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే జుట్టు పెరగాలంటే శరీరానికి చాలా పోషకాలు అవసరమవుతాయి. మనం ఏది తిన్నా అది నేరుగా చర్మం, జుట్టుపై ప్రభావం చూపుతుంది. ఈరోజుల్లో జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో చాలామంది కొత్త కొత్త మార్గాలని అనుసరిస్తున్నారు. అందుకే జుట్టు బాగా పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.
బెర్రీలు
వేసవి కాలంలో బెర్రీలు ఎక్కువగా లభిస్తాయి. ఆహారంలో బెర్రీలను చేర్చినట్లయితే అది జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టును బలపడుతుంది. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
చిలగడదుంప
జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లోపాన్ని తీర్చుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను తప్పనిసరిగా తీసుకోవాలి.
బొప్పాయి
బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు తప్పనిసరిగా బొప్పాయిని తీసుకోవాలి.