Health Tips: గుండెపోటుని నివారించాలంటే ఈ పండ్లు తినాల్సిందే..!
Health Tips: గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది పుట్టినప్పటి నుంచి మరణించేవరకు కొట్టుకుంటూనే ఉంటుంది.
Health Tips: గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది పుట్టినప్పటి నుంచి మరణించేవరకు కొట్టుకుంటూనే ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోపోతే గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువగా కొవ్వు ఉండే ఆహారాన్ని అవైడ్ చేయడం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలు, పండ్లు కచ్చితంగా డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ నాలుగు పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.
1. మామిడికాయ
మామిడి పండు పేరు వినగానే నోరూరుతుంది. దీనికోసం వేసవి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాం. మామిడిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
2. నిమ్మకాయ
నిమ్మరసం ఔషధ గుణాలు కలిగిన పానీయం. ఇది సలాడ్ల నుంచి షర్బత్ వరకు అన్నిటిలో ఉపయోగిస్తారు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
3. అరటిపండు
అరటిపండు తినని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. అరటిపండ్లను పరిమిత పరిమాణంలో తినడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు.
4. పైనాపిల్
పైనాపిల్ అద్భుతమైన పండు. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గుండెపోటు రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. అయితే రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది కాబట్టి పరిమితికి మించి తినకూడదని గుర్తుంచుకోండి.