Oxygen: రక్తంలో ఆక్సిజన్ కొరత ఉంటే ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్..!
Oxygen: ప్రస్తుతం చాలా మంది రక్తంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు.
Oxygen: ప్రస్తుతం చాలా మంది రక్తంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో ఇబ్బందులు పడుతున్నారు. మీరు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవాలనుకుంటే ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. మీరు కూడా ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నట్లయితే ఈ పండ్లని డైట్‌లో చేర్చుకోండి. వీటిని తినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.
1.నిమ్మకాయ
నిమ్మకాయ మన ఇళ్లలో తరచుగా ఉపయోగించే ఒక పండు. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే నిమ్మకాయ ఆక్సిజన్ ఆధారిత ఆహారం అని చాలా మందికి తెలియదు. ఇది మీ శారీరక అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది.
2.మామిడి, బొప్పాయి
మీరు రోజూ బొప్పాయి తింటే రక్తంలో ఆక్సిజన్ కొరత ఉండదు. వేసవిలో తాజా మామిడిని తినవచ్చు. ఈ రెండు పండ్లు మూత్రపిండాలను శుభ్రపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
3.పైనాపిల్, ఎండుద్రాక్ష
మీరు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచాలనుకుంటే రోజువారీ ఆహారంలో పైనాపిల్, ఎండుద్రాక్ష, బేరి పండ్లను చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆహారాలలో pH స్థాయి 8.5 ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
4.ఇతర ఆహారాలు
రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచడానికి వెల్లుల్లి, అరటిపండు, బెర్రీలు, ఖర్జూరాలు, క్యారెట్లు వంటివి తినాలి. ఈరోజు నుంచే వీటిని డైట్‌లో చేర్చుకోండి.