Bones Weak: ఈ ఆహారాలు ఎముకలకి శత్రువులు.. తినడం మానేస్తే బెటర్..!

Bones Weak: ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఏ పని చేయలేరు.

Update: 2023-05-20 16:00 GMT

Bones Weak:ఈ ఆహారాలు ఎముకలకి శత్రువులు.. తినడం మానేస్తే బెటర్..!

Bones Weak: ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఏ పని చేయలేరు. తప్పనిసరిగా కాల్షియం, విటమిన్ డి ఆహారంలో చేర్చాలి. ఇవి ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే ఎముకలను దెబ్బతీసే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాంటి ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

సోడియంతో కూడిన ఆహారాలు

ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు ఎముకలకి హాని కలిగిస్తాయి. ఎక్కువ ఉప్పు కాల్షియం లోపానికి కారణమవుతుంది. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారుతాయి. అందువల్ల, ఆహారంలో ఉప్పు మితంగా ఉండాలి.

కార్బోనేటేడ్ డ్రింక్స్

కార్బోనేటేడ్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారి ఎముకలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇవి రక్తంలో ఎసిడిటీ స్థాయిని పెంచే యాసిడ్‌ని కలిగి ఉంటాయి. దీని కారణంగా ఎముకలు గట్టితనాన్ని కోల్పోతాయి.

చక్కెర ఆహారాలు

చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు తినడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఇప్పటికే బోలు ఎముకల వ్యాధి ఉన్న వ్యక్తులు చక్కెరతో చేసిన వాటిని తినకూడదు. ఎందుకంటే ఇది ఎముకలను మరింత బలహీనపరుస్తుంది.

కెఫిన్

పరిమిత పరిమాణంలో కెఫిన్ ఆరోగ్యానికి మంచిదే. కానీ కొంతమంది ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కెఫిన్ కలిగిన పదార్థాలు ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News