Brains Sharp: ఇవి తినిపిస్తే పిల్లలు షార్ప్‌ అవుతారు..!

Brains Sharp: ఇవి తినిపిస్తే పిల్లలు షార్ప్‌ అవుతారు..!

Update: 2022-09-28 16:30 GMT

Brains Sharp: ఇవి తినిపిస్తే పిల్లలు షార్ప్‌ అవుతారు..!

Brains Sharp: ప్రతి ఒక్కరూ తమ పిల్లలు చురుకుగా, తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం తల్లిదండ్రులు చేయాల్సిన పని ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడమే. పిల్లల మెదడు 5 సంవత్సరాల వయస్సు వరకు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో పిల్లలకు మంచి ఆహారం అందించాలి. దీనివల్ల మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. మెదడు చురుకుగా ఉండాలంటే పిల్లలకి ఎలాంటి ఆహారం తినిపించాలో తెలుసుకుందాం.

1. బాదం

బాదం మెదడుని చురుకుగా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి. బాదం మెదడు కణాలను సరిచేయడానికి పని చేస్తుంది. బాదంపప్పులో ఉండే పోషకాలు మెదడును పటిష్టం చేసి జ్ఞాపకశక్తికి పదును పెట్టేలా పని చేస్తాయి. రోజూ రెండు బాదంపప్పులను రాత్రి నానబెట్టి పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది.

2. వాల్నట్

వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాల్ నట్స్ తినడం వల్ల మెదడు పదును పెరుగుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి ఉపయోగపడతాయి. పిల్లలకు ప్రతిరోజూ ఒక వాల్‌నట్‌ను అల్పాహారంగా తినిపించాలి.

3. గుడ్లు

గుడ్డులో ఉండే పోషకాలు బ్రెయిన్‌ షార్ప్‌ చేస్తాయి. గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మెదడును బలంగా చేస్తుంది. పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు తినిపించడం ప్రయోజనకరం. దీని వల్ల శరీరం వ్యాధులకు దూరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటం ద్వారా మనస్సు దృఢంగా ఉంటుంది.

4. పెరుగు

పెరుగు కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. ఇందులో మంచి కొవ్వు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లలకు రోజూ పెరుగు తినిపించాలి.

5. ఆపిల్

ఆపిల్‌లో పెద్ద మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఆపిల్ తినడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞాపకశక్తి బలపడుతుంది. ఆపిల్ పిల్లల మెదడు, శారీరక అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News