Uric Acid: ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి.. ఈరోజే డైట్ నుంచి తొలగించండి..!
Uric Acid: మూత్రపిండము తగినంత పరిమాణంలో యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేయలేనప్పుడు దాని స్థాయి శరీరంలో పెరుగుతుంది.
Uric Acid: మనం ప్రతిరోజు తినే ఆహారం, పానీయాలు శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అయితే తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య మొదలవుతుంది. ఇది శరీరంలో ఏర్పడే ఒక చెడు ఉత్పత్తి. ఇది ప్యూరిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడుతుంది. మూత్రపిండము తగినంత పరిమాణంలో యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేయలేనప్పుడు దాని స్థాయి శరీరంలో పెరుగుతుంది. దీనివల్ల మీరు నడవడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
స్వీట్లు
స్వీట్లంటే చాలామందికి ఇష్టం. అయితే ఎక్కువ స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎందుకంటే స్వీట్లలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే అది యూరిక్ స్థాయిని మరింత పెంచుతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. అతిగా మద్యం సేవించే వారి కిడ్నీ సరిగా పనిచేయదు. దీని కారణంగా యూరిక్ యాసిడ్ స్థాయి శరీరంలో పెరుగుతూ ఉంటుంది.
సిట్రస్ పండ్లు
సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచే పండ్లు కూడా ఉంటాయి. నిమ్మ, నారింజ వంటి పండ్లను ఎక్కువగా తినకూడదు. వీటి కారణంగా యూరిక్ యాసిడ్ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.