Health Tips: ఈ ఆహారాలు ప్రొటీన్‌రిచ్‌ ఫుడ్స్‌.. డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: మన శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ చాలా ముఖ్యం.

Update: 2022-09-05 13:30 GMT

Health Tips: ఈ ఆహారాలు ప్రొటీన్‌రిచ్‌ ఫుడ్స్‌.. డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: మన శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది మన కణాల పనితీరులో సహాయపడే సూక్ష్మ పోషకం. అంటే దైనందిన కార్యకలాపాలు సక్రమంగా కొనసాగాలంటే ప్రొటీన్‌ కచ్చితంగా అవసరం. అయితే ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. గుడ్డు

గుడ్డు ప్రోటీన్ ముఖ్య వనరు. ఇది శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్లు, సహజ కొవ్వులని అందిస్తుంది. ప్రజలు తరచుగా అల్పాహారంలో తినడానికి ఇష్టపడతారు.

2. పాలు

పాలు అన్ని రకాల పోషకాలను కలిగి ఉన్నందున సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇది ప్రోటీన్ మంచి మూలం కూడా. 100 గ్రాముల పాలలో దాదాపు 3.6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అందుకే రోజూ ఒక గ్లాసు పాలు తప్పనిసరిగా తాగాలి.

3. మాంసం

చికెన్ లేదా రెడ్ మీట్‌లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి నాన్-వెజ్ ఐటమ్స్ తినే వారికి పోషకాల కొరత ఉండదు. అయితే మాంసం చాలా కొవ్వుగా ఉండకూడదని గుర్తుంచుకోండి. లేదంటే అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం తలెత్తుతుంది.

4. సోయాబీన్

శాఖాహారం తీసుకునే వారికి సోయాబీన్ ప్రోటీన్ అవసరాన్ని చాలా వరకు తీరుస్తుంది. 100 గ్రాముల సోయాబీన్స్‌లో దాదాపు 36.9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్‌గా తినాలి.

5. పప్పు

పప్పు మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగం. దీనిని అన్నం, రోటీతో కలిపి తింటారు. ఇది మన రోజువారీ ప్రోటీన్ అవసరాలను చాలా వరకు తీరుస్తుంది.

Tags:    

Similar News