Liver Damage: ఈ ఆహారాలు లివర్‌ని డ్యామేజ్‌ చేస్తాయి.. దూరంగా ఉంటే బెటర్..!

Liver Damage: నేటి రోజుల్లో చాలామంది లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే.

Update: 2023-07-04 15:00 GMT

Liver Damage: ఈ ఆహారాలు లివర్‌ని డ్యామేజ్‌ చేస్తాయి.. దూరంగా ఉంటే బెటర్..!

Liver Damage: నేటి రోజుల్లో చాలామంది లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. వాస్తవానికి లివర్‌ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. మనం ఏది తిన్నా, తాగినా అది నేరుగా లివర్‌పై ప్రభావం చూపుతుంది. అందుకే ఆహార, పానీయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లకి దూరంగా ఉండాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

మద్యం

ఆల్కహాల్ లివర్‌కి అత్యంత హానికరం. ఇది ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం క్రమంగా దెబ్బతింటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ కాలేయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి.

చక్కెర

ఎక్కువ చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే లివర్‌ పని చక్కెరను కొవ్వుగా మార్చడం. మీరు ఎక్కువ చక్కెరను తింటే లివర్‌ అవసరమైన దానికంటే ఎక్కువ కొవ్వును తయారు చేస్తుంది. ఇది చాలా కాలం పాటు కొనసాగితే కొవ్వు కాలేయ వ్యాధి సంభవిస్తుంది. అందుకే అధిక చక్కెర పదార్థాలు తినడం మానుకోవాలి.

జంతు ఉత్పత్తులు

జంతు ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ ఎక్కువగా తీసుకుంటే అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. నిజానికి జంతు ఉత్పత్తులు చాలా సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే లివర్‌పై భారం పడుతుంది. ఆహారంలో ప్రతిరోజూ 2-3 కప్పుల పూర్తి కొవ్వు పాలను చేర్చుకుంటే అది లివర్‌కి మంచిది కాదు.

Tags:    

Similar News