Weight Gain Foods: బరువు తక్కువగా ఉండే పిల్లల కోసం ఈ ఆహారాలు బెస్ట్..?
Weight Gain Foods: బరువు తక్కువగా ఉండే పిల్లల కోసం ఈ ఆహారాలు బెస్ట్..?
weight Gain Foods: దేశంలో చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో బరువు తక్కువగా, సన్నగా ఉండి అనారోగ్యం బారిన పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేటికాలం పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌ని ఇష్టపడుతున్నారు. ఇది మంచిది కాదు అంతేకాదు ఊబకాయానికి కూడా దారి తీస్తుంది. అయితే బరువు తక్కువగా ఉండే పిల్లలకు ఈ ఆహారాలు తప్పనిసరి. అవేంటో చూద్దాం.
గోధుమలతో చేసిన చపాతీలు పిల్లలకి తినిపిస్తే చాలా మంచిది. అంతేకాదు గోధుమ గంజిలో పచ్చి కూరగాయలు కలిపి ఒక మంచి సూప్ తయారుచేసి పిల్లలకి తాగిస్తే చాలా మంచిది. దీంతో అతడు చాలా బలంగా తయారవుతాడు. చికెన్‌లో ప్రొటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాదు కొత్త కణాల ఏర్పాటుకు కారణమవుతాయి. మీ పిల్లలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడితే వారానికి రెండుసార్లు చికెన్ తినేలా చూడండి.
పాల పదార్థాల ద్వారా పిల్లలు తొందరగా బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎముకలను బలపరుస్తుంది. పిల్లలకి పాలు తాగడం ఇష్టం లేకపోతే వెన్న, నెయ్యి, పెరుగు, పనీర్ రూపంలో ఇస్తే మంచి కండపుష్టి కలుగుతుంది. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ప్రతిరోజు పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే వారికి సరైన పోషకాలు అందుతాయి. అరటిపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కేలరీలు, ఐరన్‌తో నిండి ఉంటుంది. బరువు పెరగడానికి అరటిపండు సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు