Health: పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ఈ ఫుడ్స్ తప్పనిసరి.. అవేంటంటే..?
Health: పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ఈ ఫుడ్స్ తప్పనిసరి.. అవేంటంటే..?
Health: తల్లిదండ్రులు ఎదిగే పిల్లలపై జాగ్రత్త వహించాలి. లేదంటే వారు చాలా అనారోగ్యాలకు గురికావల్సి వస్తుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది. బరువు, శరీర ఆకృతి మొదలైనవాటిని నిశితంగా పరిశీలించాలి. చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతారు. దీనివల్ల బరువు తక్కువగా ఉండటం, సన్నగా కనిపించడం జరుగుతాయి. ఇలాంటి వారిని వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి. అంతేకాకుండా డైట్ మార్చి సూపర్ ఫుడ్స్‌ని యాడ్ చేయాలి. అవేంటో చూద్దాం.
సాధారణంగా పాల ఉత్పత్తులలో ప్రోటీన్ మాత్రమే కాకుండా కొవ్వు కూడా ఉంటుంది. బరువు పెరగడంలో ఇది సూపర్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఎముకలను బలపరిచే కాల్షియం పాల ఉత్పత్తులలో అధికంగా ఉంటుంది. పిల్లలకు పాలు తాగడం ఇష్టం లేకపోతే వెన్న, నెయ్యి, పెరుగు, పనీర్ రూపంలో అందించాలి. గోధుమలతో చేసిన పదార్థాలు తింటే పిల్లలకి చాలా శక్తి వస్తుంది. వారికి నిత్యం గోధుమ రొట్టె తినేలా అలవాటు చేయాలి. లేదంటే గోధుమ గంజిలో పచ్చి కూరగాయలు కలిపి సలాడ్‌లా అందించాలి.
పిల్లలకి నాన్ వెజ్ అందించాలి. ఇందులో ఉండే ప్రొటీన్ వారిని బలంగా తయారుచేస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడితే వారానికి రెండు రోజులు చికెన్ లేదా మటన్ అందించవచ్చు. ఇందులో ఉండే ప్రొటీన్ కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాదు ప్రొటీన్ల సాయంతో కొత్త కణాలు కూడా ఏర్పడుతాయి. వారానికి ఒకసారి చేపలు కూడా తినిపించాలి. ఇందులో ఓమేగా, మంచి కొవ్వు సమృద్ధిగా దొరుకుతుంది. వీటికి తోడు పండ్లు. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా అందించాలి. ముఖ్యంగా అరటిపండులో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది కేలరీలు, ఐరన్‌తో నిండి ఉంటుంది. పిల్లలు కూడా వీటిని ఇష్టంతో తింటారు. బరువు పెరగడానికి అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది.