Summer Health Tips: వేసవిలో ఇవి తినవద్దు.. ఆరోగ్యానికి పెద్ద ఎఫెక్ట్..!
Summer Health Tips: ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు చల్లటి పదార్థాలని తింటారు.
Summer Health Tips: ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు చల్లటి పదార్థాలని తింటారు. ఇందులో అనేక రకాల పండ్లు, కూరగాయలు పానీయాలు ఉంటాయి. నీరు సమృద్ధిగా ఉండే వాటిని తినడం ఉత్తమం. వీటి ప్రభావం చల్లగా ఉంటుంది. ఈ సీజన్‌లో హీట్ స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సరైన డైట్ మెయింటెన్ చేయడం అవసరం. చల్లటి పదార్థాలు తినడంతో పాటు కొన్ని ఆహారాలకి దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాంటి ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం మానుకుంటే మంచిది. ఇవి ఎంత రుచికరంగా ఉన్నా చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ ఆహారాలలో సోడియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. దీంతోపాటు శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ ఆహారాలకు బదులుగా పండ్లు, కూరగాయలను తినవచ్చు.
కెఫిన్
చాలా మంది ఉదయం పూట ఎనర్జిటిక్ గా ఉండేందుకు కాఫీ తాగుతుంటారు. కానీ కెఫిన్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఈ పరిస్థితిలో మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి కెఫిన్‌కు బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవడం అవసరరం. కొబ్బరి నీరు, ఒక గ్లాసు నీరు తాగవచ్చు. ఈ పానీయాలు మిమ్మల్ని తాజాగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.
నూనె ఆహారాలు
వేసవిలో ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. దీని కారణంగా మీరు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటిని తిన్న తర్వాత చాలా అసౌకర్యంగా భావిస్తారు. వేయించిన, కాల్చిన వాటిని తినడానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ చేర్చుకోవడం మంచిది.
చక్కెర పానీయాలు
ఈ సీజన్‌లో శీతల పానీయాల పేరుతో చాలా మంది చక్కెర పానీయాలను అమ్ముతుంటారు. వీటిలో చాలా కేలరీలు ఉంటాయి. ఇది మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీనికి బదులుగా మీరు కొబ్బరి నీరు లేదా మరేదైనా రిఫ్రెష్ డ్రింక్ తీసుకోవచ్చు.