కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు ఆహారాలు తప్పనిసరి..

Kidneys Healthy: కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. బాడీలోని టాక్సిన్ అన్నింటిని బయటికి పంపే పనిని నిర్వహిస్తాయి

Update: 2021-11-23 16:00 GMT

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు ఆహారాలు తప్పనిసరి (ఫైల్ ఇమేజ్)

Kidneys Healthy: కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. బాడీలోని టాక్సిన్ అన్నింటిని బయటికి పంపే పనిని నిర్వహిస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే విషపదార్థాలు బయటికి పోక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని ఎల్లప్పుడు కాపాడుకోవాలి. కిడ్నీ చెడిపోతే శరీరంలో గుండె సంబంధిత వ్యాధులు కూడా మొదలవుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంల సహాయపడతాయని భావిస్తారు. కాబట్టి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.

1. వెల్లుల్లి

కొందరు వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. కానీ కిడ్నీలో సోడియం, పొటాషియం, ఫాస్పరస్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇది మన మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే రోజూ వెల్లుల్లిని తీసుకుంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

2. క్యాప్సికమ్

క్యాప్సికమ్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి క్యాప్సికమ్లో కూడా లభిస్తుంది. మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాప్సికమ్ సహాయపడటానికి ఇదే కారణం.

3. చేప

కిడ్నీకి చేపలు మేలు చేస్తాయి. చేపల వినియోగం కిడ్నీకి అత్యంత ప్రయోజనకరం. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. చేపలను ఆహారంలో చేర్చుకుంటే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

4. ఆపిల్

ప్రతి ఒక్కరూ యాపిల్ తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన పండ్లలో ఒకటి. యాపిల్స్లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కిడ్నీలకు మేలు చేస్తుంది.

5. క్యాబేజీ

క్యాబేజీని సాధారణంగా చలికాలంలో తింటారు. క్యాబేజీలో ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Tags:    

Similar News