Health Tips: పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించాలంటే ఈ ఆయుర్వేద నివారణలు సూపర్..!
Health Tips: పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించాలంటే ఈ ఆయుర్వేద నివారణలు సూపర్..!
Health Tips: ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా బయటి ఆహారాలకి అలవాటుపడ్డారు. వీటిలో పీచు వంటి పోషకాలు తగ్గిపోయి పిల్లలకు మలబద్దకం ఏర్పడుతుంది. ఇవి రుచిలో మంచివి కానీ తక్కువ ఆరోగ్యకరమైన ఆహారాలు. రోజూ బ్రెడ్‌తో చేసిన అల్పాహారం కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పిల్లలలో మలబద్ధకం కారణంగా ఎప్పుడు వారి కడుపులో నొప్పిగా ఉంటుంది. దీంతో వైద్యుడి వద్దకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం వల్ల ఈ సమస్యను తొలగించవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
త్రిఫల మూలికా
త్రిఫలని అనేక మూలికలతో తయారుచేస్తారు. ఇది నిమిషాల్లో మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పిల్లలకు ఇంగ్లీషు మందు ఇవ్వడం కంటే ఈ పొడిని ఇవ్వడం మేలు. ఇందులో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పిల్లలే కాదు గర్భధారణ సమయంలో కూడా దీనిని ఉపయోగించవచ్చు.
పాలు, నెయ్యి
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చెంచాల నెయ్యి కలుపుకుని తాగడం చాలా పాత పద్దతి. అయితే అన్ని రకాల మలబద్దకాలను అంతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. నెయ్యి గురించి చెప్పాలంటే ఇది ఆయుర్వేద ఏజెంట్‌గా పరిగణిస్తారు. ఇది మలబద్ధకంతో సహా శరీరంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
అత్తి ,అంజీర్
పిల్లలకి తరచుగా అత్తి పండ్లను తినిపించాలి. వీటిలో పొట్టకు అవసరమైన పీచుపదార్థాలు అత్యధికంగా ఉంటాయి. పిల్లలు ఖాళీ కడుపుతో లేదా భోజన సమయంలో తినవచ్చు. కానీ తినడానికి ముందు కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా చేయడానికి పని చేస్తాయి.