Ayurvedic Methods: వర్షాకాలం ఆయుర్వేద పద్దతులు మరిచిపోవద్దు.. ఇన్‌ఫెక్షన్‌కి గురికావొద్దంటే పాటించాల్సిందే..!
Ayurvedic Methods: వర్షాకాలంలో భారీ వరదల వల్ల చుట్టు పక్కల పరిసరాల్లో నీరు నిలుస్తుంది. ఇవి ఈగలు, దోమలకి నిలయంగా మారుతాయి.
Ayurvedic Methods: వర్షాకాలంలో భారీ వరదల వల్ల చుట్టు పక్కల పరిసరాల్లో నీరు నిలుస్తుంది. ఇవి ఈగలు, దోమలకి నిలయంగా మారుతాయి. దీంతో అంటువ్యాధులు సంభవిస్తాయి. జ్వరం, వాంతులు అయితే వెంటనే ఆస్పత్రికి వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందుకే ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని పద్దతులు పాటించాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కొన్ని రకాల ఆయర్వేద పద్దతులని పాటించడం వల్ల ఇన్‌ఫెక్షన్ నివారించవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
సూక్ష్మజీవులను దూరంగా ఉంచడానికి, ఇన్‌ఫెక్షన్ నివారించడానికి ఔషధ స్నానం చేయాలి. దీనివల్ల వాత దోషం తొలగిపోతుంది. అలాగే డ్రై మసాజ్ తరచుగా చేయించుకోవాలి. ఇది కూడా శరీరంలో వాత దోషాన్ని సమతుల్యం చేస్తుంది. శరీర కణజాలాల నుంచి విషాన్ని తొలగిస్తుంది. పంచకర్మలోని ఐదు విధానాలలో ఔషధ బస్తీ ఒకటి. దీనినే ఎనిమా అనే పేరుతో పిలుస్తారు. ఇది ప్రధానంగా అస్థాపన, అనువాసన రెండు రకాలుగా ఉంటుంది. వీటిని పాటించడం వల్ల వాత వ్యాధులు తొలగిపోతాయి.
మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. లోతైన శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి. మానసికంగా ధృడంగా తయారవుతారు. అయితే వర్షాకాలంలో ఆయుర్వేదం ప్రకారం కొన్ని చేయకూడని పనులని కూడా తెలుసుకోవాలి.
వర్షాకాలంలో చేయకూడనివి
1. చెప్పులు లేకుండా బయట తిరగవద్దు, పాదాలను పొడిగా ఉంచుకోవాలి
2. వర్షంలో ఆడటం మానుకోవాలి.
3. భారీ వ్యాయామాలు, పగటివేళ నిద్ర పోవడంను నివారించాలి.
4. తరచుగా మజ్జిగ తాగడం మంచిది కాదు.