Ayurvedic Herbs: ఇంట్లో లభించే ఈ మూలికలు అందాన్ని రెట్టింపు చేస్తాయి..!
Ayurvedic Herbs: మహిళలు అందమైన చర్మం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు.
Ayurvedic Herbs: మహిళలు అందమైన చర్మం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. మార్కెట్‌లో లభించే వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతారు. కానీ చాలావరకు ఇందులో రసాయనాలు కలుస్తాయి. ఇవి మన చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంట్లో సులభంగా లభించే వస్తువులను ఉపయోగించడం వల్ల అందమైన మచ్చలేని చర్మాన్ని పొందవచ్చు. ఆయుర్వేదం అన్ని సమస్యలకి పరిష్కార మార్గం చూపించింది. అందాన్ని పెంచే కొన్ని మూలికల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పసుపు
పసుపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి మాత్రమే కాకుండా అనేక శారీరక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఉసిరి
ఉసిరి కూడా చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఉసిరి చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇది హానికరమైన పదార్థాల నుంచి మీ చర్మాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. ఉసిరిని ఆహారంలో చేర్చుకోవచ్చు అలాగే పచ్చిగా కూడా తినవచ్చు. ఉసిరికాయ పోషకాల పవర్‌హౌస్. దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉసిరికాయతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
అశ్వగంధ
అశ్వగంధ చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అశ్వగంధని ప్రతిరోజు వాడటం వల్ల చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. ఆరోగ్యంగా, మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. మొటిమలు, పగుళ్లు, తదితర సమస్యలను అధిగమించవచ్చు. ఇది కాకుండా మెరిసే చర్మం కోసం చందనం పొడిని కూడా ఉపయోగించవచ్చు.