Irregular Periods: నెలసరి సరిగ్గా రావడం లేదా? ఈ వ్యాధి ఉందేమో జాగ్రత్త.!

Irregular Periods: జీవనశైలి,చెడు ఆహారపు అలవాట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్, ఎండూ మెట్రికల్ క్యాన్సర్ అనేది మోనోపాజ్ దశలో చాలా మంది ఆడవారిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పీరియడ్స్ ఇరెగ్యులర్ గా వస్తాయి.

Update: 2024-06-18 14:56 GMT

Irregular Periods: నెలసరి సరిగ్గా రావడం లేదా? ఈ వ్యాధి ఉందేమో జాగ్రత్త.!

Irregular Periods: నేటికాలంలో ప్రతిఒక్కరినీ భయపెడుతున్న సమస్య క్యాన్సర్. టెక్నాలజీ ఎంత పెరిగినా..అడ్వాన్డ్ చికిత్సలు అందుబాటులోకి వచ్చినా ఈ సమస్యను ముందుగానే గుర్తిస్తేనే ఫలితం ఉంటుంది. రోగనిర్ధారణను గుర్తించడంలో ఏమాత్రం ఆలస్యమైనా సమస్య తీవ్రమై ప్రాణాలమీదకు వస్తుంది. నిజానికీ మగవారు, ఆడవారిని ఇద్దర్నీ ఎఫెక్ట్స్ చేసే క్యాన్సర్స్ ఉన్నాయి.ముఖ్యంగా హార్మోన్స్ కారణంగా వస్తాయి. గర్భాశయం, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆడవారిలో వచ్చే సాధారణ క్యాన్సర్ లో ఇది ఒకటి. దీనిని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభం అవుతుంది. ఈ క్యాన్సర్ గురించి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఎండోమెట్రియల్ క్యాన్సర్:

మోనోపాజ్ దశలో వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి ఎండోమెట్రియల్. ఇది సాధారణంగా మోనోపాజ్ దశలో వస్తుంది. అయితే కొంతమందికి చిన్న వయస్సులోనే వచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. రక్తపోటు, ఊబకాయం, మధుమేహం ఉన్నవారికి ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయస్సులోనే పాలిసిస్టిక్ అండాశయాలు, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని ముందుగా గుర్తించడం చాలా అవసరం.

మోనోపాజ్ అనంతరం:

కొంతమందికి మోనోపాజ్ అనంతరం కూడా బ్లీడింగ్ అవుతుంది. 40ఏండ్ల తర్వాత ఎక్కువగా బ్లీడింగ్, ఇరెగ్యులర్ పీరియడ్స్ ను గమనిస్తుండాలి. అదేవిధంగా రెండు పీరియడ్స్ మధ్య వచ్చే బ్లీడింగ్ ను కూడా గమనిస్తుండాలి. శృంగార సమయంలో రక్తస్రావం అయినా కూడా అనుమానించాల్సిందే. కొందరికీ ఇలాంటి లక్షణాలు ఏవీ లేకున్నా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ అనేది తప్పనిసరి.

పరీక్షలు తప్పనిసరి:

పైన పేర్కొన్న వాటిలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ప్రాథమిక పరీక్షల తర్వాత పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కాన్, ఎండోమెట్రియల్ బయాప్సీ, సర్వైకల్ బయాప్సీ వంటి సమస్యలను గుర్తించే పరీక్షలు చేస్తారు. వ్యాధులను గమనిస్తే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.

కారణాలు తెలుసుకోవడం ముఖ్యం:

పైన చెప్పిన లక్షణాలే కాదు కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు లక్షణాలను గమనిస్తే వాటికి సంబంధించిన కారణాలను కూడా తెలుసుకోవాలి. దీనికోసం గైనకాలజిస్టులను సంప్రదించాలి. ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. రెగ్యులర్ చెకప్స్, శరీరంలో అన్ని మార్పులు రోగనిర్ధారణకు తప్పనిసరిగా నిర్ధారించాల్సిన విషయాలు ఇవి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.



Tags:    

Similar News