Iron Deficiency: మనశరీంలో ఐరన్ లోపిస్తే..ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?

Anemia : నేటికాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి కొన్నిసార్లు ఐరన్ లోపం ఉన్నట్లు తెలియదు. మీలో కొన్ని లక్షణాలు కనిపించినట్లయితే రక్తహీనత సమస్యలు ఉన్నట్లు తెలుసుకోవాలి. రక్త హీనత అంటే ఏమిటి. దాని లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-08-10 05:31 GMT

Iron Deficiency: మనశరీంలో ఐరన్ లోపిస్తే..ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?

Iron Deficiency: మనశరీరంలో రక్తం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో ఏ చిన్న సమస్య వచ్చిన కూడా అది పెను ప్రమాదంగా మారే ఛాన్స్ ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. శరీరంలో తగినంత రక్తంలో లేనట్లయితే దాని ఎనిమీయా అంటారు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం విటమిన్ లోపం వల్ల రక్తహీనత సమస్యకు దారి తీస్తుంది. అయితే చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నా..తమకు రక్తహీనత ఉన్నట్లు వారికి తెలియదు.

తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే రక్త పరీక్ష చేస్తుంటారు. ఆ సమయంలో శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తారు. అయితే ఇలా కాకుండా రక్తహీనత ఉన్నవారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని గుర్తించి సకాలలో వైద్యం తీసుకోవాలి. ఎనిమీయా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో వైద్యులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

కాలేయం, కిడ్నీలు, గుండె వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువ రోజుల నుంచి మందులు వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీ చికిత్స్ తీసుకునేవారిలోనూ రక్తహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏర్పడే ఎనిమీయా ఐరన్ లోపం వల్ల వస్తుంది. ఆహారం ద్వారా ఐరన్ లబించనట్లయితే లేదా శరీరంలో కణాలు ఆహారంలోని ఐరన్ ను శోషించకపోవడం వల్ల ఈ రకం ఎనిమియా వస్తుంది.

అలసట:

రక్తహీనతతో బాధపడేవారు బాగా విశ్రాంతి తీసుకున్నా తీవ్రమైన నీరసం వేధిస్తుంది. రూజువారి పనులకు కూడా అలసిపోతుంటారు. ఏ పనిచేయాలన్న ధ్యాస ఉండదు.

తలనొప్పి:

రక్తహీనత ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పితోపాటు మైకం కమ్మినట్లుగా అనిపిస్తుంది.

-ఐరన్ లోపంతో బాధపడే వారిలో హిమోగ్లోబిన్ లెవల్స్ తగ్గడం వల్ల పెదవులు, గోర్లు, చర్మం పాలిపోయినట్లు అనిపిస్తుంది.

-శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఛాతీలో నొప్పి వస్తుంది.

-మన శరీంలో తగిన ఐరన్ లేనట్లయితే రక్తంలో ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల వేడివాతావరణంలో కూడా కాళ్లు, చేతులు చల్లగా ఉంటాయి.

-ఐరన్ లోపం వల్ల రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ వస్తుంది. ఈ సమస్య కారణంగా కాళ్లు కదులుతాయి. రాత్రి సమయంలో నిద్ర రాదు

-జట్టు పెళుసుగా పొడిబారిపోతుంది. వెంట్రుకలు ఊడిపోతాయి.

-గోర్లు తర్వగా విరిగిపోతాయి.


Tags:    

Similar News