Kids: ఉదయం చిన్నారులకు బిస్కెట్స్ ఇస్తున్నారా.? ఎంత ప్రమాదమో తెలుసా.?
సాధారణంగా బిస్కెట్స్ తయారీ మైదా పిండి, అధిక సోడియం, షగర్ కంటెంట్, ఆర్టిఫిషియల్ షుగర్స్‌ను ఉపయోగిస్తుంటారు.
చిన్నారులతో పాటు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వాటిలో బిస్కెట్స్ ఒకటి. ముఖ్యంగా ఉదయాన్నే స్కూలుకు వెళ్లే సమయంలో చిన్నారులకు బిస్కెట్స్‌ను ఎక్కువగా ఇస్తుంటారు. అప్పటికప్పుడు రడీగా ఉండడం, ఉదయాన్నే సులభంగా చిన్నారులకు టిఫిన్‌లాగా ఉపయోగపడుతుందని చాలా మంది బిస్కెట్స్‌ను ఇస్తుంటారు. అయితే పడగడుపున బిస్కెట్స్ తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా బిస్కెట్స్ తయారీ మైదా పిండి, అధిక సోడియం, షగర్ కంటెంట్, ఆర్టిఫిషియల్ షుగర్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇవి చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బిస్కెట్లను ఇవ్వడం వల్ల శరీరంలో క్యాలరీలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీంతో చిన్నారుల్లో అధిక బరువుకు ఇది కారణమవుతుందని అంటున్నారు. అంతేకాకుండా పడగడుపున బిస్కెట్స్‌ను అందించడం వల్ల పిల్ల్లో టైప్2 డయాబెటిస్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇదేదో ఆషామాషీగా చెబుతోన్న విషయం కాదు. పలు పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. బిస్కెట్స్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని, ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. ఊబకాయం, టైప్2 డయాబెటిస్‌కు కూడా ఇది కారణమవుతుందని అంటున్నారు.
బిస్కెట్స్ తయారీలో ఉపయోగించే పిండి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. గోధుమ పిండిని ప్రాసెస్ చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం అవుతాయి. ప్రాసెస్ చేసిన తెల్ల పిండి ఆరోగ్యానికి చాలా ప్రమాదకం. ఇలాంటి పిండితో తయారు చేసిన బిస్కెట్స్‌ను తినడం వల్ల చిన్నారుల జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన పిండి తినడం వల్ల పిల్లల ప్రేగుల పనితీరు మందగిస్తుంది. ఇది క్రమంగా బలబద్ధకానికి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక ఉదయాన్నే చిన్నారులకు బిస్కెట్స్ ఇస్తే జీర్ణకోశ సమస్యలతో పాటు కడుపు నొప్పి, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా దంత సమస్యలు కూడా తప్పవని చెబుతున్నారు. తరచూ బిస్కెట్స్ తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు భారీగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అందుకే వీలైనంత వరకు చిన్నారులకు ఉదయం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను అందించాలి తప్ప బిస్కెట్స్‌ను ఇవ్వకూడదు.