Eyesight: చిన్న వయసులోనే కళ్లు మసకబారడానికి కారణాలు ఇవే..!

Eyesight: చిన్న వయసులోనే కళ్లు మసకబారడానికి కారణాలు ఇవే..!

Update: 2022-03-07 03:30 GMT

Eyesight: చిన్న వయసులోనే కళ్లు మసకబారడానికి కారణాలు ఇవే..!

Eyesight: చిన్న వయసులోనే కళ్లు మసకబారడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణాలు జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చదవేటప్పుడు సరైన పద్దతులు పాటించకపోవడం, ఎక్కువగా టీవీ చూడటం లేదా మొబైల్ ఉపయోగించడం వంటివి చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. తరచుగా తలనొప్పి, అస్పష్టమైన చూపు, కళ్ళు ఎర్రబడటం ఐ సైట్‌ లక్షణాలుగా చెప్పవచ్చు. ఇవి మీ కంటి చూపు తగ్గుతోందని తెలియజేస్తాయి. ఈ పరిస్థితిలో వీటిని అస్సలు విస్మరించవద్దు. అప్పుడు వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

అనేక కారణాల వల్ల కంటి చూపు తగ్గినప్పటికీ, ఇందులో నాడీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. నరాల సంబంధిత సమస్యలు చిన్న వయస్సులోనే అస్పష్టమైన దృష్టికి లేదా కంటి చూపు తగ్గడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా నమ్ముతారు. ఈ సమయంలో, ఇది చిన్న వయస్సులో తక్కువగా కనిపిస్తుంది. ఇది కాకుండా జన్యుపరంగా కూడా ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఉంటాయి. దీంతో చిన్న వయస్సులో కళ్లు కనిపించడం మానేస్తాయి. కుటుంబ సభ్యులకు అల్బినిజం వ్యాధి లేదా రెటినిటిస్ పిగ్మెంటోసా ఉన్నట్లయితే ఈ పరిస్థితులు పిల్లలలో కనిపిస్తాయి. ఈ సమయంలో అస్పష్టమైన దృష్టి చిన్న వయస్సులోనే వస్తుంది. అంధత్వం కూడా సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల చాలా వరకూ చూపుకి సంబంధించిన సమస్యలు నివారించవచ్చు. బొప్పాయిలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటికి మాత్రమే కాదు, స్కిన్, హెయిర్, డైజెషన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. వారానికి రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. సలాడ్స్ లో తీసుకోవచ్చు, లేదా ముక్కలు చేసి అలాగే తినేయవచ్చు. క్యారెట్‌లో కూడా బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలోకి వెళ్ళి విటమిన్ ఏ గా మారుతుంది. కాబట్టి క్యారెట్స్ తో కూర, జ్యూస్, శాండ్విచెస్, సలాడ్స్ అన్నీ చేసి పిల్లలకి పెట్టాలి.

Tags:    

Similar News