Tablets Medicine: ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే నరకానికి స్వాగతం పలికినట్లే

Update: 2024-10-30 01:44 GMT

Tablets Medicine: మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా చాలా మంది చిన్న అనారోగ్య సమస్యలకు ఆసుపత్రికి వెళ్తుంటారు. లేదంటే సొంతంగా వైద్యులకు తెలియకుండానే మందులు వాడుతుంటారు.

భవిష్యత్తులో వాటి పరిణామం తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ శరీరంలోని పలు అవయవాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చాలా మంది నేరుగా మెడికల్ షాప్ నకు వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు వచ్చిందని మందలు తీసుకుని వేసుకుంటారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సొంత వైద్య మీదే ఆధారపడుతుంటారు. సాధారణంగా ఎవరైనా అనారోగ్య సమస్య రాగానే మందులు డోలూ సిక్స్ 650, 500 ఎంజీ వాడుతుంటారు.

ఒంటి నొప్పులు తగ్గేందుకు ఇలా వరుసగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సమస్య రానప్పటికీ..కంటిన్యూగా అదే పనిగా వేసుకోవడం వల్ల నొప్పులు తగ్గాయనుకుంటారు. కానీ ఈ విధంగా కంటిన్యూగా వేసుకోవడం వల్ల సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

జ్వరమైన,ఒంటి నొప్పులైనా ఎలాంటి రోగాలైనా రెండు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఒకటే ట్యాబ్లెట్ పదే పదే వేసుకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి.

వైద్యుల సూచన మేరకే మందులు వాడాలని..ఇష్టం వచ్చిన రీతిలో ట్యాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News