Liver Swelling: కిచెన్‌లో ఉండే ఈ 4 వస్తువులు కాలేయ వాపుని తగ్గిస్తాయి.. ఎలా ఉపయోగించాలంటే..?
Liver Swelling: శరీరంలోని ప్రధాన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది శరీరంలో జరిగే అన్ని పనులకు సహకరిస్తుంది. ఇది దెబ్బతిందంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
Liver Swelling: శరీరంలోని ప్రధాన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది శరీరంలో జరిగే అన్ని పనులకు సహకరిస్తుంది. ఇది దెబ్బతిందంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాలేయంలో కొవ్వు ఉండటం సహజం. కానీ ఈ కొవ్వు పెరిగితే కాలేయంలో వాపు ఏర్పడుతుంది. ప్రస్తుతం జీవనశైలి సరిగా లేకపోవడంతో ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా పెరుగుతోంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలేయంలో వాపు కారణంగా ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితిలో మీరు కూడా కాలేయ వాపు సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ పరీక్షలు చేయించుకోండి. అయితే కాలేయం వాపును తగ్గించడంలో సహాయపడే కొన్ని హోం రెమెడీస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఆపిల్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ కాలేయ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాలేయాన్ని డిటాక్సిఫై చేయగలదు. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి రోజూ తాగాలి. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కాలేయం వాపు తగ్గుతుంది.
నిమ్మకాయ నీరు
విటమిన్ సి పవర్‌హౌస్‌గా నిమ్మకాయను పిలుస్తారు. ఇది కాలేయ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ కాలేయ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. ప్రతిరోజు ఆహారంలో నిమ్మరసం ఉండేలా చూసుకోండి.
పసుపు
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఉంటాయి. పసుపులో బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్ ఉంటుంది. ఇది వాపు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసి బాగా మరిగించి తాగితే కాలేయ వాపు తగ్గుతుంది.
గ్రీన్ టీ
కాలేయ వాపు సమస్య ఉన్నప్పుడు గ్రీన్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది. కాటెచిన్‌లు అధికంగా ఉండే గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కాలేయ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయానికి మేలు జరుగుతుంది.