Health Tips: వంటగదిలో ఉండే ఈ నాలుగింటితో మలబద్దకానికి చెక్.. అవేంటంటే..?
Health Tips: నేటి కాలంలో ప్రజలు ఆహారంపై శ్రద్ధ చూపని కారణంగా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.
Health Tips: నేటి కాలంలో ప్రజలు ఆహారంపై శ్రద్ధ చూపని కారణంగా మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఒకరికి పని చేయాలని అనిపించదు. రోజంతా ఆకలి లేకపోవడం, ఛాతీలో మంట, తేనుపులు, కడుపులో నొప్పి మొదలైన సమస్యలు సంభవిస్తాయి. ఎక్కువ నూనె మసాలాలు తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం, శరీరంలో నీటి కొరత వల్ల మలబద్దకం ఏర్పడుతుంది. కొందరిలో ఈ సమస్య 1-2 రోజుల్లో నయమవుతుంది. కానీ మరికొందరు ఈ సమస్యతో చాలా కాలం పాటు పోరాడవలసి ఉంటుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వైద్యుల వద్దకు వెళ్తుంటారు. అయితే ఈ సమస్యను దేశీ వస్తువులతో కూడా నయం చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
పెరుగు
పెరుగు పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్ (బిఫిడోబాక్టీరియం లాక్టిస్) జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగును రోజూ తినడానికి ప్రయత్నించండి మీకు మలబద్ధకం సమస్య ఉండదు.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్
బ్రోకలీ, బచ్చలికూర, బ్రస్సెల్స్ మొలకలు వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మిమ్మల్ని మలబద్ధకం నుంచి దూరంగా ఉంచుతుంది. రోజువారీ ఆహారంలో ఈ కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.
నెయ్యి
చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు కానీ అందులో నిజం లేదు. పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యం, ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఉసిరికాయ
ఉసిరి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ సూపర్ ఫుడ్ మిమ్మల్ని మలబద్ధకం సమస్య నుంచి దూరంగా ఉంచుతుంది. చాలా కాలంగా మలబద్ధకం సమస్య ఉంటే ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 2 టీస్పూన్ల ఉసిరి రసాన్ని తీసుకోవాలి.