Health Tips: ఈ 3 పానీయాలు కిడ్నీలని క్లీన్‌ చేస్తాయి.. ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు..!

Health Tips: ఈ 3 పానీయాలు కిడ్నీలని క్లీన్‌ చేస్తాయి.. ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు..!

Update: 2023-02-20 12:33 GMT

Health Tips: ఈ 3 పానీయాలు కిడ్నీలని క్లీన్‌ చేస్తాయి.. ప్రతిరోజు తీసుకుంటే మంచి ఫలితాలు..!

Health Tips: మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరచడానికి, శరీరం నుంచి విషపదార్థాలని తొలగించడానికి పనిచేస్తాయి. కానీ చాలా సార్లు కొన్ని టాక్సిన్స్ కిడ్నీలని దెబ్బతీస్తాయి. వీటివల్ల ఒక్కోసారి కిడ్నీలు ఫెయిల్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ రోజూ ఒక డ్రింక్ తాగడం వల్ల కిడ్నీలని క్లీన్‌ చేసుకోవచ్చు. వాటిని దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. కిడ్నీ క్లెన్సింగ్ డ్రింక్స్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

మూత్రపిండము ప్రధాన విధి శరీరంలోని మురికిని, ద్రవాలను మూత్రం ద్వారా బయటికి పంపించడం. ఇది కాకుండా మూత్రపిండాలు శరీరంలోని ఉప్పు, పొటాషియం, యాసిడ్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇతర భాగాలు పనిచేయడానికి అవసరమైన హార్మోన్లు మూత్రపిండాల నుంచి విడుదలవుతాయి. హార్వర్డ్ నివేదిక ప్రకారం రోజూ 2 గ్లాసుల నిమ్మరసం తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది. కిడ్నీ నుంచి టాక్సిన్స్ తొలగిపోతాయని తేలింది. అదే సమయంలో, రోజూ 2 నుంచి 2.5 లీటర్ల మూత్ర విసర్జన చేసే వ్యక్తులకి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కిడ్నీ హెల్తీ డ్రింక్ ఉదయం, మధ్యాహ్నం తాగవచ్చు.

1. పుదీనాతో నిమ్మకాయ

నిమ్మరసం, పుదీనా ఆకులు, కొంత చక్కెరను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలిపి తాగాలి. మూత్రపిండాల కోసం ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రతిరోజు తాగితే అవి ఆరోగ్యంగా ఉంటాయి.

2. మసాలా లెమన్ సోడా

ఒక గ్లాసులో నిమ్మరసం, జీలకర్ర-ధనియాల పొడి, సోడా వేసి బాగా కలిపి తీసుకోవాలి. ఈ పానీయం కిడ్నీలని కాపాడుతుంది.

3. కొబ్బరి షికంజీ

ఈ హెల్తీ కిడ్నీ డ్రింక్ చేయడానికి ఒక గ్లాసులో కొబ్బరి నీళ్ళు పోయాలి. ఇందులో నిమ్మరసం కలుపుకుని తాగాలి. కిడ్నీలు క్లీన్‌ అవుతాయి.

Tags:    

Similar News