Weak Eyesight: ఆహారంలో మార్పులు చేస్తే అద్దాల అవసరమే ఉండదు..!
Weak Eyesight: ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి.
Weak Eyesight: ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కంటి చూపు బలహీనపడటానికి అతి పెద్ద కారణం పోషకాహార లోపమే. ఆహారంలో సరైన ఖనిజాలు, విటమిన్లు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రజలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపుతున్నారు. కళ్లు చెదిరిపోవడానికి ఇది ప్రధాన కారణం. మీరు మీ కంటి చూపును చక్కగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే డైట్‌లో మార్పులు చేయాలి. అవేంటో తెలుసుకుందాం.
అన్నింటిలో మొదటిది మీరు ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌పై తక్కువ సమయం గడపాలి. పుస్తకాన్ని చదివేటప్పుడు కళ్లకు, పుస్తకానికి మధ్య దాదాపు 25 సెంటీమీటర్ల దూరం ఉండాలి. కంప్యూటర్ వద్ద నిరంతరం కూర్చోవడం తగ్గించుకోవాలి. టీవీ చూడటం తగ్గించాలి. కంటి చూపు అధ్వాన్నంగా ఉంటే ఆహారంలో విటమిన్ ఎ మొత్తాన్ని పెంచాలి. ఇది మీ కళ్ల బయటి పొరను కాపాడుతుంది. చిలగడదుంపలు, క్యారెట్లు, ఆకుకూరలు, గుమ్మడికాయలలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది.
అంతేకాదు కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో విటమిన్ B6, B9, B12 మొత్తాన్ని పెంచాలి. ఇవి గింజలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మాంసం, కాయధాన్యాలు, బీన్స్‌లో పుష్కలంగా దొరుకుతాయి. విటమిన్ సి చర్మం, కళ్ళకు మంచిది. ఇందుకోసం రోజువారీ ఆహారంలో ఉసిరి, నిమ్మ, జామ, బ్రోకలీ, అరటిపండును తీసుకుంటే మంచిది. విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది సాల్మన్, అవకాడోలో ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా కళ్లు క్షీణిస్తున్నా లేదా కంటిచూపు బలహీనపడుతున్నా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడుతారు.