Beauty Tips: ఉప్పునీటితో ముఖం క్లీన్‌.. ఇంకా చర్మానికి ఈ ప్రయోజనాలు..!

Beauty Tips: శరీరానికి ఉప్పు అవసరం కచ్చితంగా ఉంటుంది కానీ ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి.

Update: 2023-09-08 16:00 GMT

Beauty Tips: ఉప్పునీటితో ముఖం క్లీన్‌.. ఇంకా చర్మానికి ఈ ప్రయోజనాలు..!

Beauty Tips: శరీరానికి ఉప్పు అవసరం కచ్చితంగా ఉంటుంది కానీ ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ముఖ సౌందర్యానికి కూడా ఉప్పు ఉపయోగపడుతుంది. ఉప్పు నీటితో ఫేస్‌ వాష్‌ చేయడం వల్ల ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది. అంతే కాకుండా నల్ల మచ్చలు మాయమవుతాయి. ఉప్పునీటితో ముఖం ఎలా క్లీన్‌ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

ఉప్పు నీటితో ఫేస్‌ వాష్‌

ముందుగా 4 కప్పుల నీటిని తీసుకొని సుమారు 20 నిమిషాలు బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిలో 2 టీస్పూన్ల అయోడైజ్ చేయని ఉప్పును కలపాలి. ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. మొటిమలు పోతాయి

ఉప్పునీరు సహజంగా బ్యాక్టీరియాను గ్రహిస్తుంది. ముఖంపై రంధ్రాలను బిగుతుగా చేసి మురికి పేరుకుపోకుండా చేస్తుంది. తద్వారా మొటిమల సమస్య తొలగిపోతుంది.

2. పొడి చర్మం

ఉప్పు నీళ్లతో ముఖం కడుక్కుంటే సొరియాసిస్, చర్మం పొడిబారడం వంటివి ఉండవు. ఎందుకంటే ఉప్పులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఎక్స్‌పోలియేట్‌ చేస్తాయి.

3. మచ్చలని తొలగిపోతాయి

ఉప్పు నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై మచ్చలు క్రమంగా తొలగిపోతాయి. ఇది అద్భుతమైన ఎక్స్‌ఫోలియంట్‌గా పనిచేస్తుంది. ఇది మృతకణాలని తొలగిస్తుంది. దీనివల్ల కొత్త చర్మ కణాలు ఏర్పడుతాయి.

4. ముఖం యవ్వనంగా

ఉప్పు నీరు సహజమైన యాంటీ బయాటిక్‌. ఇది చర్మం నుంచి హానికరమైన టాక్సిన్స్, బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.

Tags:    

Similar News