Health Benefits of Coriander: చర్మ సౌందర్యానికి కొత్తిమీర
Health Benefits of Coriander: విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోలోపల నుంచీ కొత్తిమీర కాపాడుతుంది.
Health Benefits of Coriander: ఆకుపచ్చ రంగులో వుంటూ, మంచి రుచి, సువాసన కల ఆకు కొత్తిమీర. కొత్తిమీరను ఫ్లేవర్ కోసం కూరల్లో వేసుకుంటాం. ఐతే... కరివేపాకులా దాన్ని తీసిపారేయరు కాబట్టి... దాన్లో పోషకాలు శరీరానికి అందుతాయి. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్దిగా ఉన్నాయి అందువల్ల కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాల్ని మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.
స్కిన్ కేర్...
చర్మ సమస్యలకు కొత్తిమీర తో చెక్ పెట్టవచ్చు. కొత్తిమీరను కొన్ని రోజులు తింటా వుంటే... చర్మం సంగతి అది చూసుకుంటుంది. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర అత్యంత కీలకమైనది. విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోలోపల నుంచీ కొత్తిమీర కాపాడుతుంది. మొటిమలు లేదా వర్ణద్రవ్యం, జిడ్డుగల లేదా పొడి చర్మం, మొటిమలు లేదా బ్లాక్ హెడ్స్, కొత్తిమీర రసం మేజిక్ లాగా పనిచేస్తుంది.
టైప్ 2 డయాబెటిస్...
హైబీపీ క్రమంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు కారణమవుతుంది. ధనియాలు, కొత్తిమీర, ధనియాల నూనె వంటివి... బీపీని తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించే విషయంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో కూడా కొత్తిమీర బాగా పనిచేస్తోంది.
పార్కిన్‌సన్స్, అల్జీమర్స్...
ముఖ్యంగా మతిమరపు, పార్కిన్‌సన్స్, అల్జీమర్స్ వంటివి ఏజ్ పెరుగుతున్న దశలో మెదడుపై దాడి చేస్తాయి. సరిగ్గా ఆ టైమ్‌లో కొత్తిమీర తీసుకుంటే... ఇక ఆ వ్యాధులు మన బ్రెయిన్ దరిచేరవు. నాడీ వ్యవస్థ దెబ్బతినకుండా కొత్తిమీర కాపాడుతుంది. నిత్యం ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతూ వుంటారు. ఈ టెన్షన్ తట్టుకోవాలంటే కొత్తిమీర తినాలి. అందులో యాంటీఆక్సిడెంట్స్... బ్రెయిన్‌ను హీట్ ఎక్కకుండా చేస్తాయి. మెమరీ పవర్ పెంచుతాయి.
చక్కటి జీర్ణ వ్యవస్థకు...
పేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది. మాటిమాటికీ కడుపునొప్పి వచ్చేవాళ్లు, మలబద్ధకంతో బాధపడేవాళ్లు... రోజూ కొత్తిమీర తినాలి. ఇలా 8 వారాలు తింటే... అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. చక్కగా ఆకలి వేస్తుంది... చక్కగా అరుగుతుంది కూడా. సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉన్నాయి. తినే ఆహారం కల్తీ అయితే... మన ప్రాణాలకే ప్రమాదం. అలాంటి సమయంలో... కొత్తిమీర తీసుకోవడం ద్వారా చాలా వరకూ ప్రాణాలు కాపాడుతుంది. అందులోని డోడెసెనాల్ అనే పదార్థం... బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాకి కొత్తిమీర తగిలిందంటే... ఇక అది గిలగిలా కొట్టుకొని చస్తుంది.
హార్మోన్ల సమతుల్యతకు...
కొత్తిమీర రసాన్ని తాగడం వల్ల ఒంట్లో పేరుకుపోయిన సీసం, అల్యూమినియం, కాడ్మియం, పాదరసం లాంటి ఖనిజాలు బయటకు వెళ్తాయి. ఇవి ఒంట్లో ఉండటం వల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించి, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కొత్తిమీర రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాలేయ పనితీరు మెరుగుపర్చడంలో...
కాలేయం పనితీరు మెరుగుపర్చడంలో కొత్తిమీర రసం తర్వాతే ఏదైనా. కూరలు, సలాడ్లలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.కొత్తిమీర జ్యూస్‌లో రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత రెండు టీ స్పూన్ల నిమ్మరసం, అర టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకొని, వడ పోయకుండా అలానే తాగాలి. రోజూ ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఈ జ్యూస్ తాగాక అరగంట దాకా ఏమీ తినకూడదు..ఇంకా అనేక సమస్యల నుండి మనల్ని కాపాడటంలో కొత్తిమీర సహకరిస్తుంది. ఇంకెందుకు రోజూ మన వంటల్లో ఎక్కువగా కొత్తమీరను తీసుకుంటే సరి....