Drumstick Benefits: మునగతో ఉక్కులాంటి బొక్కలు మీ సొంతం.. దీని ఆకులు ఈ వ్యాధికి దివ్యవౌషధం..!

Drumstick Benefits: దక్షిణ భారతంలో మునక్కాయ అంటే తెలియనివారు ఉండరు. ఎంతో ఇష్టంగా తినే కూరగాయ. ముఖ్యంగా సాంబారు, పప్పుచారులో ఎక్కువగా వాడుతారు.

Update: 2023-09-06 15:03 GMT

Drumstick Benefits: మునగతో ఉక్కులాంటి బొక్కలు మీ సొంతం.. దీని ఆకులు ఈ వ్యాధికి దివ్యవౌషధం..!

Drumstick Benefits: దక్షిణ భారతంలో మునక్కాయ అంటే తెలియనివారు ఉండరు. ఎంతో ఇష్టంగా తినే కూరగాయ. ముఖ్యంగా సాంబారు, పప్పుచారులో ఎక్కువగా వాడుతారు. దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు మరే కూరగాయలో లభించవు. కేవలం మునక్కాయలు మాత్రమే కాదు మునగ ఆకులలో కూడా అద్భుత ఔషధగుణాలు దాగి ఉన్నాయి. మునగలో క్యాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్లు, ఫైబర్, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. మునగ ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మునగ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటిడిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని ఆకులు, పొడి, గింజలు అన్ని తినవచ్చు. గుండె, మధుమేహ రోగులకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తహీనతను నయం చేయడానికి పనిచేస్తుంది. నారింజలో కంటే ఏడు రెట్లు విటమిన్ సి, క్యారెట్ కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ సి మునగలో లభిస్తుందని ఒక పరిశోధనల తేలింది. ఇవన్ని ఆరోగ్యానికి చాలా మంచివి.

మునగ ప్రయోజనాలు

మునగ లేదా మునగ ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ఆకులలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మునగకాయ తినడం వల్ల శరీరానికి అంతులేని శక్తి అందుతుంది. ఇది అలసటని దూరం చేస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండే మునగ ఆకులు బలహీనతను తొలగించడంలో పనిచేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. దీనివల్ల గుండెపోటు రిస్క్‌ తగ్గుతుంది.

మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మునగ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధితో పోరాడటానికి సహాయపడుతాయి. మునగ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

Tags:    

Similar News