Tea Tree Oil: మొటిమలని తొలగించడంలో సూపర్.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు..!
Tea Tree Oil: ప్రస్తుత రోజుల్లో మనుషులు ప్రకృతి నుంచి వేరుగా బతుకుతున్నారు.
Tea Tree Oil: ప్రస్తుత రోజుల్లో మనుషులు ప్రకృతి నుంచి వేరుగా బతుకుతున్నారు. అందుకే అనేక రకాల వ్యాధులకి గురవుతున్నారు. మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడొక్ట్స్‌తో అందంగా కనిపించవచ్చని చాలామంది నమ్ముతున్నారు. కానీ సహజసిద్దమైన వస్తువుల కింద అవి దేనికి పనికిరావు. టీ ట్రీ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి. ఇది ఒక సహజ పదార్ధం. ఇది ముఖాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని అన్ని విధాలుగా సురక్షితంగా ఉంచుతుంది. కానీ ఈ విషయాలు చాలామందికి తెలియవు. దీని వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
నల్ల మచ్చలు
ముఖంపై ఉండే నల్ల మచ్చలు మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి. వాటిని తొలగించేందుకు ఖరీదైన క్రీములకు బదులు టీ ట్రీ ఆయిల్ ఉపయోగంచడం బెస్ట్. ఒక చెంచా తేనెలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై 10 నుంచి 20 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
బ్లాక్ హెడ్స్
ఆయిల్ ఫేస్ ఉన్నవారిలో బ్లాక్ హెడ్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఇందుకు మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే టీ ట్రీ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. బ్లాక్ హెడ్స్ తొలగించాలంటే టీ ట్రీ ఆయిల్, ముల్తానీ మిట్టి తీసుకోవాలి. రెండింటినీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య వెంటనే దూరమవుతుంది.
మొటిమలు
శరీరంలో వేడి వల్ల ముఖంలో మొటిమలు ఏర్పడుతాయి. ఈ సమస్యను వదిలించుకోవడానికి టీ ట్రీ ఆయిల్ అత్యంత ప్రయోజనకరమైనదిగా చెప్పవచ్చు. టీ ట్రీ ఆయిల్‌లో ఉండే గుణాలు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందుకోసం టీ ట్రీ ఆయిల్‌ను ముఖానికి రాసుకుని మసాజ్ చేయలి. కొన్ని రోజుల్లో మచ్చలు మాయమవుతాయి.
మేకప్ రిమూవర్
మేకప్ రిమూవర్ కోసం కెమికల్ అధికంగా ఉండే స్ప్రే కంటే టీ ట్రీ ఆయిల్‌ను ఉపయోగించడం ఉత్తమం. ఈ నూనె మేకప్‌ను తొలగించడంతో పాటు ముఖంపై ఉండే రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.