Beauty Tips: మెడపై టానింగ్‌ పేరుకుపోయిందా.. దీనిని ఉపయోగించి చిటికెలో క్లీన్ చేయండి..!

Beauty Tips: మెడ వెనుక భాగంలో టానింగ్‌ వల్ల నల్లగా మారడం సర్వసాధారణం.

Update: 2023-03-11 12:30 GMT

Beauty Tips: మెడపై టానింగ్‌ పేరుకుపోయిందా.. దీనిని ఉపయోగించి చిటికెలో క్లీన్ చేయండి..!

Beauty Tips: మెడ వెనుక భాగంలో టానింగ్‌ వల్ల నల్లగా మారడం సర్వసాధారణం. సాధారణంగా మెడ నలుపును మనం చూడలేము. కానీ ఇతర వ్యక్తులు చూసి కామెంట్ చేస్తుంటారు. మెడ చుట్టూ మురికి పేరుకుపోతే అందం మొత్తం దెబ్బతింటుంది. దీనిని దాచడం చాలా కష్టమైన పని. అయితే దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పార్లర్‌లో వేల రూపాయలు ఖర్చు చేయకుండా మెడ శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

నిమ్మకాయ

నిమ్మకాయ ఉపయోగించి మెడపై ఉండే నల్లదనాన్ని పోగొట్టుకోవచ్చు. ఇలాంటి పద్దతి మన అమ్మమ్మల కాలం నుంచే కొనసాగుతోంది. నిమ్మకాయలో ఔషధగుణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ బి, భాస్వరం, కార్బోహైడ్రేట్ నలుపుని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మకాయని 2 విధాలుగా ఉపయోగించవచ్చు..

1. నిమ్మకాయ, దోసకాయ

నిమ్మకాయ, దోసకాయ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మెడని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మెడపై ఈ రెండు వస్తువులను కలిపి టోనర్‌గా ఉపయోగించాలి. సుమారు 15 నిమిషాల తర్వాత మెడను కడిగి తుడవాలి. ఇది మురికి, ధూళిని తొలగిస్తుంది.

2. నిమ్మకాయ, బంగాళాదుంప

నిమ్మకాయతో పాటు బంగాళాదుంప కూడా చర్మానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు. ఈ రెండింటి రసాన్ని ఒక గిన్నెలో తీసుకొని కాటన్ బాల్స్ సహాయంతో ప్రభావిత ప్రాంతాల్లో రుద్దాలి. సుమారు 20 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో మెడను కడగాలి. రోజూ వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Tags:    

Similar News