చలి కాలంలో పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి అవసరం.. ఎందుకంటే..?

Turmeric: చలికాలంలో పసుపుని తప్పకుండా వంటలలో చేర్చుకోవాలి. ఇది మంచి యాంటీ బయాటిక్. సీజనల్‌ వ్యాధులతో పోరాడుతుంది.

Update: 2021-12-16 15:15 GMT

చలి కాలంలో పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి అవసరం.. ఎందుకంటే..?

Turmeric: చలికాలంలో పసుపుని తప్పకుండా వంటలలో చేర్చుకోవాలి. ఇది మంచి యాంటీ బయాటిక్. సీజనల్‌ వ్యాధులతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. పసుపు పలు ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నారు. ఔషధాల తయారీలో వాడుతున్నారు. చలికాలంలో పసుపును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఆసక్తికరమైన ప్రయోజనాలను తెలుసుకుందాం.

1. ఫ్లూ నుంచి కాపాడుతుంది

చలికాలంలో తరచుగా జలుబు, దగ్గును ఎదుర్కోవలసి వస్తుంది. పసుపు పాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. గర్భిణీలు తరచుగా పసుపు పాలను తాగాలి. పసుపు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. పసుపు శ్వాసకోశ మార్గాన్ని శుభ్రపరుస్తుంది. కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా ఇది జలుబు, దగ్గుతో పోరాడడంలో సహాయపడుతుంది.

2. జీర్ణక్రియలో సహాయపడుతుంది

చలికాలం రోగాలు రాకుండా ఉండాలంటే కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. పసుపు ఆహారం రుచిని పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపిస్తుంది.

3. వ్యాధులను నయం చేస్తుంది

పసుపు సహజ పదార్ధం. ఇది సాధారణ జలుబు సైనస్, బాధాకరమైన కీళ్ళు, అజీర్ణం, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు పాలు, టీ వంటి పానీయాలలో చిటికెడు పసుపును కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. పసుపును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

4. సైనస్‌ సమస్యకి పరిష్కారం

సైనసైటిస్‌తో బాధపడుతున్న చాలా మంది చలికాలంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. విశ్రాంతి లేకపోవడం, తలనొప్పిని అనుభవిస్తారు. రోజూ ఒక గ్లాసు పసుపు పాలు తాగడం వల్ల సైనస్ చికాకు, అసౌకర్యం నుంచి ఉపశమనం దొరుకుతుంది.

5. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరానికి లోపలి నుంచి మేలు చేస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరచడంలో పసుపు సహాయపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. అందుకే పసుపును క్రమం తప్పకుండా తీసుకోవాలి.

Tags:    

Similar News