Health Tips: ఈ పొరపాట్ల వల్ల చుండ్రు సమస్య.. అస్సలు చేయవద్దు..!

Health Tips: చలికాలంలో చుండ్రు సమస్య సర్వసాధారణం. తరచుగా తల నుంచి చుండ్రు రాలడం మొదలవుతుంది.

Update: 2023-02-04 15:00 GMT

Health Tips: ఈ పొరపాట్ల వల్ల చుండ్రు సమస్య.. అస్సలు చేయవద్దు..!

Health Tips: చలికాలంలో చుండ్రు సమస్య సర్వసాధారణం. తరచుగా తల నుంచి చుండ్రు రాలడం మొదలవుతుంది. ఈ కారణంగా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అందుకే చుండ్రును వదిలించుకోవడం ముఖ్యం. కొన్ని హోం రెమిడిస్‌ని పాటించడం వల్ల చుండ్రుని వదిలించుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జుట్టుని శుభ్రంగా ఉంచాలి

చుండ్రును వదిలించుకోవడానికి ముఖ్యంగా తలని శుభ్రంగా ఉంచుకోవాలి. దీని కోసం జుట్టును వారానికి 3-4 సార్లు కడగాలి. 2 శాతం కెటోకానజోల్ లేదా జింక్ పైరిథియోన్ ఉండే షాంపూని ఉపయోగించవచ్చు.

జుట్టుకు నూనె అప్లై చేయవద్దు

తలలో చుండ్రు సమస్య ఉంటే హెయిర్ ఆయిల్‌ను అప్లై చేయడం మానుకోవాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో నూనెకు దూరంగా ఉండాలి.

మురికి దువ్వెన వద్దు

మీరు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఎవరైనా ఉపయోగించిన దువ్వెన వాడవద్దు. ఇది జుట్టులో చుండ్రును మరింత పెంచుతుంది.

పని తర్వాత జుట్టు కడగడం

మీరు రోజువారీ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తే జుట్టులో చెమట వస్తుంది. ఈ సందర్భంలో జుట్టును వెంటనే శుభ్రమైన నీటితో కడగాలి.

ఎక్కువ కాలం టోపీ వద్దు

ఎండలో బయటకు వెళ్లినప్పుడు టోపీని ధరిస్తే చెమట ఎక్కువగా వస్తుంది. ఇది మీ జుట్టులో చుండ్రు సమస్యకు దారితీస్తుంది. ఇన్ని చేసినా చుండ్రు తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.

Tags:    

Similar News