Health Tips: కిడ్నీల ఆరోగ్యానికి ఇవి కచ్చితంగా చేయాలి.. అప్పుడే ఫిట్‌గా ఉంటారు..!

Health Tips: నేటి రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-03-17 13:30 GMT

Health Tips: కిడ్నీల ఆరోగ్యానికి ఇవి కచ్చితంగా చేయాలి.. అప్పుడే ఫిట్‌గా ఉంటారు..!

Health Tips: నేటి రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల అనేక ఇతర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే మీ రోజువారీ అలవాట్లే కిడ్నీలో సమస్యలకి కారణం అవుతున్నాయి. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

మందులు వద్దు

చాలా మందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ప్రతి చిన్నదానికి మందులు వేసుకుంటారు. ఇది కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మందులు మూత్రపిండాలకు హాని కలిగించేలా పనిచేస్తాయి. అందుకే వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు.

ఆరోగ్యకరమైన ఆహారం

కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు రావు. అదే సమయంలో ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.

పుష్కలంగా నీరు

పుష్కలంగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నీరు తాగడం వల్ల కిడ్నీలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. దీని వల్ల మీకు రాళ్లు లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు.

మత్తుకు దూరం

స్మోకింగ్ కిడ్నీలని దెబ్బతీస్తుంది. మరోవైపు మద్యం తాగడం వల్ల కిడ్నీ సరిగా పనిచేయదు. కిడ్నీ సమస్యలు రాకూడదనుకుంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

రోజువారీ వ్యాయామం

కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. దీని కారణంగా మధుమేహం, గుండె జబ్బుల సమస్య కూడా తక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News